Mahesh Babu: ‘అమరావతికి అటు ఇటు’.. ఏంటిది? మహేష్ ఏంటి ఈ పొలిటిక్స్ ఏంటి?

Mahesh Babu Trivikram movie title

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ (Trivikram Srinivas) దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది. లేటుగా షూటింగ్ ప్రారంభించినా కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని మహేష్ భావిస్తున్నాడట. ఇప్పటికే రాజమౌళి (Rajamouli).. మహేష్‌తో సినిమా కోసం సర్వం సిద్ధం చేస్తున్నారు. ఇక రాజమౌళికి డేట్స్ ఇచ్చాడంటే వేరే షూటింగ్స్ అన్నీ బంద్ పెట్టుకోవాల్సిందేననో ఏమో కానీ మహేష్ మాత్రం త్రివిక్రమ్‌తో సినిమాను సూపర్ ఫాస్ట్‌గా కానిచ్చేస్తున్నాడట.

ఈ క్రమంలోనే ఎప్పుడూ ఫ్యామిలీతో కలిసి టూర్లకు చెక్కేసే మహేష్.. ఈ సారి కేవలం భార్యా పిల్లలను మాత్రమే పంపించాడని టాక్. సమ్మర్ కల్లా ఈ సినిమాను పూర్తి చేసి ఆగస్ట్ నెలలో ఇండిపెండెన్స్ డే కానుకగా విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అయితే మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) సైతం ఇండిపెండెన్స్‌ డే కానుకగానే భోళా శంకర్ (Bhola Shankar) మూవీని విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. మరి ఈ క్రమంలో మహేష్ తన సినిమా విడుదల తేదీని వాయిదా వేస్తాడా? లేదంటే చిరు (Chiranjeevi)కు పోటీగా విడుదల చేస్తాడా? అనేది సస్పెన్స్‌గా మారింది.

ఇక మహేష్ – త్రివిక్రమ్ (Mahesh Babu – Trivikram) మూవీ టైటిల్‌పై ఇటీవలి కాలంలో పెద్ద చర్చే నడుస్తోంది. ఇప్పటికే కొన్ని పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అమ్మ మాట, అడవిలో అర్జునుడు అంటూ రకరకాల టైటిల్ నేమ్స్ వినిపించాయి. ఇక తాజాగా టైటిల్‌పై మరో హాట్ న్యూస్ వినిపిస్తోంది. ‘అమరావతికి అటు ఇటు’ (Amaravathiki Atu Itu) అనే టైటిల్‌ను చిత్ర యూనిట్ ఫిక్స్ చేసిందని ప్రచారం జరుగుతోంది. అసలే ఏపీలో అమరావతి పొలిటికల్ హాట్ టాపిక్‌గా ఉంది. ఈ తరుణంలో మహేష్ అలాంటి టైటిల్ ఫిక్స్ చేస్తారా? అనేది సందేహంగా మారింది. మహేష్ అయితే పొలిటిక్స్ జోలికి వెళ్లడన్నది అందరికీ తెలిసిందే. ఒకవేళ ఈ టైటిల్‌ను ఫిక్స్‌ చేసినా కూడా కథ మాత్రం పొలిటిక్స్ చుట్టూ తిరగదని తెలుస్తోంది.

Google News