Minister Malla Reddy: మంత్రి మల్లారెడ్డిని పవన్ సినిమాలో విలన్ కోసం అడగ్గా.. రియాక్షన్ ఎలా ఇచ్చారో చూడండి..!

Minister Mallareddy in Pawan Kalyan film

వివాదాస్పద వ్యాఖ్యలకు, కామెడీ మాటలకు తెలంగాణ మంత్రి మల్లా రెడ్డి (Minister Malla Reddy) పెట్టింది పేరు. నిజమే.. ప్రస్తుతం ఆయన ఏం మాట్లాడినా సంచలనమే. ఏం మాట్లాడినా బీభత్సంగా వైరల్ అవుతోంది. ఇక ఆయన కాలేజీల్లో ఏం మాట్లాడినా కూడా ఆ కళాశాల విద్యార్థులు దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అంతే క్షణాల్లో ఆయన మాటలు వైరల్ అవుతున్నాయి. ఇటీవల ‘కష్టపడ్డా.. పూలమ్మినా.. పాలమ్మినా.. కాలేజీలు పెట్టినా.. స్కూళ్లు పెట్టినా’’ అంటూ మల్లారెడ్డి వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

ఇక ఆ వ్యాఖ్యలకు ఎన్ని రీల్స్ వచ్చాయో నెటిజన్లకు తెలియనిది కాదు. ఇక ‘యువతీ యువకులు డబ్బున్న వాళ్ళను చూసి ప్రేమించండి’ అంటూ మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు సైతం తెగ వైరల్ అయ్యాయి. ఇక తాజాగా కూడా.. హోలీ సందర్భంగా మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ (Mallareddy Engineering College) లో విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ.. ‘నేను పెద్దగా చదువుకోలే… నేను పెద్ద మేధావిని కాదు.. పాలమ్మిన… పూలమ్మిన… కాలేజీలు పెట్టిన… ఆస్పత్రులు కట్టిన… వేల మంది విద్యార్థులను తయారు చేసిన, దేశాన్నేలే గొప్పవాళ్ళను తయారు చేసిన… అందుకే మల్లన్న అంటే ఇంత క్రేజ్ ఉన్నది…. నేను తుమ్మితే తుఫాన్ అయితది..’’ అని ఆయన అన్నారు.

Advertisement
Pawan Kalyan's Bhavadeeyudu Bhagat Singh

ఈ వ్యాఖ్యలు చేస్తుంటే విద్యార్థులు ఈలలు, కేకలతో మరింత సపోర్ట్ ఇచ్చారు. అంతా మల్లారెడ్డి (Minister Malla Reddy) మరింత రెచ్చిపోయారు. ఇక తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు మరింత వైరల్ అవతున్నాయి. ఇటీవల డైరెక్టర్ హరీశ్ శంకర్ (Harish Shankar) తన ఇంటికి వచ్చారని తెలిపారు. గంటసేపు కూర్చున్నారని వెల్లడించారు. అంతటితో ఆగితే బాగానే ఉండు.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ (Pawan Kalyan)తో సినిమా తీస్తున్నానని.. ఆ సినిమాలో మల్లారెడ్డిని విలన్‌గా చేయాలని హరీశ్ శంకర్ (Harish Shankar) అడిగారని చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.