Samantha: షాకింగ్ న్యూస్ చెప్పిన సమంత..!

Samantha reveals shocking news

స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కెరీర్ మంచి పీక్ స్టేజ్‌లో ఉండగానే హీరో నాగ చైతన్య (Naga Chaitanya)తో విడాకులు తీసుకుంది. ఈ విషయంలో సోషల్ మీడియా అయితే తప్పంతా ఆమె పైనే వేసింది. ఆమె పెళ్లయిన తర్వాత గ్లామర్ డోస్‌ను పెంచడం.. ఫ్యామిలీ మ్యాన్ (Family Man) వంటి వెబ్ సిరీస్ చేయడం ఆమె వైవాహిక జీవితానికి ఇబ్బందులు తెచ్చిపెట్టాయనే టాక్ బలంగానే నడిచింది. కేవలం తన కెరీర్ కోసమే విడాకులు తీసుకుందని టాలీవుడ్‌లో కాస్త గట్టిగానే గుసగుసలు వినిపించాయి.

ఇక విడాకుల అనంతరం హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్‌పై సామ్ (Samantha Ruth Prabhu) దృష్టి సారించింది. యశోద (Yashoda) మూవీ చేస్తుండగానే మరో షాకింగ్ న్యూస్. ఆమెకు మయోసైటిస్ అని.. దాని కోసం ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నట్టు ప్రకటించింది. ఆ తర్వాత యశోద (Yashoda) మూవీ ప్రమోషన్స్ కోసం మాత్రమే ఆమె బయటకు వచ్చింది. ఆ సమయంలోనే తన ఆరోగ్యం ఎంత దారుణంగా ఉందనేది సామ్ వివరించింది. ఒక్కోరోజు ఒక్క అడుగు కూడా వేయలేకపోయానంటూ సుమతో ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

Samantha

ఇక తాజాగా సామ్ శాకుంతలం (Shaakuntalam) మూవీ షూటింగ్ స్టార్ట్ చేసింది. అంతేకాకుండా తాజాగా ఒక ఫోటో షూట్ కూడా చేసింది. ఇది చూసిన వారంతా సామ్ (Samantha) ఈజ్ బ్యాక్ అనుకున్నారు. అంత స్టైలిష్‌గా ఆమె ఫోటోలకు ఫోజులిచ్చింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో సామ్ షాకింగ్ విషయం చెప్పింది. ఇంకా తాను మయోసైటిస్ నుంచి పూర్తిగా కోలుకోలేదని తెలిపింది. ఇప్పుడిప్పుడే కాస్త బయటపడుతున్నానని.. ఆరోగ్యం మెరుగుపడుతున్న కొద్దీ తనలో ధైర్యం పెరుగుతోందని సామ్ వెల్లడించింది.

Google News
థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!