Mahesh Babu: ఆ బుక్ మహేష్ జీవితాన్ని మార్చేసింది.. అదే లేకుంటే.. బాబోయ్..!

Mahesh Babu

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu).. ఆ పేరులోనే ఒక వైబ్ ఉంది. అందుకేనేమో ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా ఉంటుంది. ఎలాంటి రూమర్స్‌కి తావివ్వకుండా చక్కగా ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని.. ఇద్దరు పిల్లలతో హ్యాపీ లైఫ్‌ను లీడ్ చేస్తున్నాడు. ఫ్యామిలీ మ్యాన్‌గా ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్నాడు. పార్టీలు, పబ్‌లు హంగామాయే ఉండదు. షూటింగ్, ఇల్లు అంతే. ఎటైనా వెళితే ఫ్యామిలీతో కలిసే వెళతాడు.

మహేష్ (Mahesh Babu) మరి పెళ్లి కాక ముందు ఎలా ఉండేవాడు అంటే.. ఒకే ఒక్క బ్యాడ్ హ్యాబిట్ ఉండేది. అదేంటంటే.. రోజుకు మూడు నుంచి నాలుగు ప్యాకెట్ల సిగిరెట్లు తాగేవాడట. అంటే రోజుకు నలభై సిగిరెట్స్ ఊదిపారేశావాడట. ఆ స్థాయిలో అడిక్ట్ అయ్యాడట. ఆ అలవాటును మానుకునేందుకు తెగ యత్నించాడట. కానీ ఎంతలా యత్నించినా కూడా ఆ అలవాటు నుంచి మాత్రం బయట పడలేకపోయాడట. విపరీతంగా ఇబ్బందిపడిపోయాడట.

మరి ఆ అలవాటును ఎలా మానుకున్నాడనేగా మీ డౌట్. మహేష్ (Mahesh Babu) ఒక పుస్తకం చదివాడట. అదేం పుస్తకమో తెలియదు కానీ దాన్ని చదివిన తర్వాత మాత్రం ఆయనకు సిగిరెట్ పైనే విరక్తి కలిగిందట. అంతే సిగిరెట్ జోలికే వెళ్లలేదట. ఇక ప్రస్తుతం మహేష్.. దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli)తో సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ లోపు త్రివిక్రమ్‌ (Trivikram Srinivas)తో సినిమా కానిచ్చేస్తున్నాడు. ఈ సినిమాను ఏమాత్రం బ్రేక్ తీసుకోకుండా సాగిస్తున్నారు.

Google News