Manchu Manoj: ‘బతకండి.. బతకనివ్వండి’ అంటూ మంచు మనోజ్ ట్వీట్‌తో మరో సంచలనం

Manchu Manoj Latest Tweet

మంచు మనోజ్(Manchu Manoj) గత రెండు రోజులుగా తన సోషల్ మీడియా పోస్టులతో సంచలనం సృష్టిస్తున్నాడు. నిన్నటికి నిన్న ఒక వీడియోను పోస్ట్ చేసి తన అన్న మంచు విష్ణు (Manchu Vishnu) తన బంధువులు, సన్నిహితులపై ఇలా దాడికి పాల్పడుతున్నాడంటూ పోస్ట్ పెట్టి పెద్ద ఎత్తున చర్ఛకు కారణమయ్యాడు. తన అనుచరుడైన సారధిపై తన అన్న దాడిని ఖండిస్తూ ఆ వీడియోను పోస్ట్ చేశాడు.

Manchu Vishnu angry on Manchu manoj relatives

ఎప్పటి నుంచో మంచు ఫ్యామిలీ (Manchu Family)లో విభేదాలు ఉన్నాయి కానీ అవి ఇప్పుడు తారా స్థాయికి చేరాయి. అయితే అన్నదమ్ముల మధ్య నెలకొన్న గొడవపై అటు మంచు మోహన్‌బాబు (Manchu Mohanbabu) కానీ మంచు లక్ష్మి కానీ పెదవి విప్పలేదు. మంచు లక్ష్మి(Manchu Lakshmi) అయితే తనకు అసలు ఈ గొడవ గురించే తెలియదని చెప్పుకొచ్చింది. మొత్తానికి జనానికి అయితే మంచు ఫ్యామిలిలో గొడవలు బీభత్సంగానే ఉన్నాయని అర్ధమైంది. అయితే మొన్నటి వరకూ అవి నివురు గప్పిన నిప్పులా ఉన్నాయి. నిన్న బయటకు వచ్చాయి.

ఇక నేడు మంచు మనోజ్ (Manchu Manoj) ట్విటర్ ఖాతాలో మరో పోస్ట్ పెట్టాడు. ‘బతకండి.. బతకనివ్వండి’ అంటూ దండం పెట్టి మరీ అర్ధించాడు. అంతే కాదు సుజీ కశీమ్, డేవిడ్ లించ్ కొటేషన్స్‌ను సైతం షేర్ చేశాడు. వారిద్దరి కొటేషన్స్ సారాంశం ఏంటంటే.. కళ్ల ముందు జరుగుతున్న తప్పుని లైట్ తీసుకోవడం కన్నా.. ఆ తప్పును ఎదిరించి చావడానికి అయినా సిద్ధమేనని ఒకటి.. క్రియేటివిటీకి నెగిటివిటీయే శత్రువు అని మరో కోట్‌ సారాంశం. మొత్తానికి మంచు మనోజ్‌కి సోషల్ మీడియాలో అయితే కావాల్సినంత సపోర్ట్ వస్తోంది.

ఇవీ చదవండి:

ఓహో.. మంచు విష్ణు, మనోజ్‌ల మధ్య గొడవ ఇందుకేనా..!

ఆయన మగతనంతో నాకేంటి పని.. వైఎస్ షర్మిల వీడియోపై సురేఖావాణి ఓ రేంజ్ లో..!

మంచు ఫ్యామిలీలో గొడవ.. రచ్చకెక్కిన విష్ణు, మనోజ్‌ల వ్యవహారం

Google News
థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!