Manchu Vishnu, Manoj: ఓహో.. మంచు విష్ణు, మనోజ్‌ల మధ్య గొడవ ఇందుకేనా..!

Manchu Manoj Vishnu

అసలు మంచు బ్రదర్స్ మధ్య వైరం ఎందుకు వచ్చింది. నిజానికి మంచు బ్రదర్స్ ఇద్దరి విషయాన్ని తీసుకుంటే మనోజ్‌ (Manchu Manoj) కు మాత్రం విష్ణు (Manchu Vishnu)తో పోలిస్తే మైలేజ్ ఎక్కువేనని చెప్పాలి. మరి ఇంట్లో ఎవరికి మైలేజ్ ఎక్కువుంది? ఎవరి మాట చెల్లుతుందంటే.. మోహన్‌బాబు (Mohanbabu) మాత్రం విష్ణుకే ఓటేస్తారు. ఎన్నో సందర్భాల్లో ఆయన విష్ణు గురించి చాలా గొప్పగా చెప్పారు. మరి అసలు వీరిద్దరి మధ్య వైరానికి కారణం ఏంటి? అంటే కేవలం ఆర్థిక వ్యవహారాలేనని తెలుస్తోంది. మొదటి నుంచి కూడా మంచు బ్రదర్స్ మధ్య కోల్డ్ వార్ నడుస్తోందని టాక్.

ఆర్థిక పరమైన ప్రయోజనాలు సైతం విష్ణుకే ఎక్కువని సమాచారం. ఈ విషయంలో కూడా మోహన్‌బాబు మంచు విష్ణు(Manchu Vishnu)కే ఆయన ఎక్కువ ప్రయోజనం చేశారు. ‘విష్ణు’ మూవీతో పెద్ద కొడుకును భారీగా లాంచ్ చేసిన మోహన్‌బాబు మనోజ్‌ను మాత్రం ఒక డబ్బింగ్ మూవీతో క్యాజువల్‌గా లాంచ్ చేశారు. కానీ అనూహ్యంగా కోట్లు పెట్టిన ‘విష్ణు’ మూవీ అట్టర్ ప్లాప్. దొంగ దొంగది చిత్రం మాత్రం హిట్ టాక్ తెచ్చుకుంది. అయితే ఇద్దరూ కూడా మంచి హీరోలుగా గుర్తింపు తెచ్చుకున్నదైతే లేదు. 

విష్ణు చేసిన మోసగాళ్లు మూవీ డిజాస్టర్ కావడంతో.. మనోజ్ (Manchu Manoj) ప్రకటించిన అహం బ్రహ్మస్మి చిత్రానికి పెట్టుబడి పెట్టేందుకు మంచు ఫ్యామిలీ ససేమిరా అంది. ఈ ప్రాజెక్ట్ ఆగిపోవడంతో దీంతో మనోజ్ (Manchu Manoj) తీవ్ర మనస్తాపానికి గురయినట్టు సమాచారం. అప్పటి నుంచి లోలోపల రగులుతున్న ఆగ్రహ జ్వాలలు ఇన్నాళ్లు బరస్ట్ అయ్యాయి. అయితే విష్ణు, మనోజ్‌లు ఒక తల్లికి పుట్టిన బిడ్డలు కాదు. మోహన్ బాబు మోదటి భార్య విద్యాదేవికి లక్ష్మికి, విష్ణు జన్మించారు. ఆమె మరణానంతరం ఆమె చెల్లి నిర్మలా దేవిని మోహన్‌బాబు వివాహమాడారు. ఆస్తి గొడవలతో పాటు అన్నదమ్ముల మధ్య గొడవకు ఇదొక కారణం అని కూడా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

Google News