Rashmika Mandanna: రష్మికపై లేటెస్ట్ చర్చ ఇదే.. చిరు వస్తే ఎందుకంత సైలెన్స్..!

Rashmika Mandanna

నేషనల్ క్రష్ రష్మిక (Rashmika Mandanna) ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో నిరంతరం ట్రోల్ అవుతూనే ఉంది. ఇటీవలి కాలంలో అమ్మడికి కాలం సరిగా కలిసొచ్చినట్టుగా లేదు. నటించిన సినిమలన్నీ డిజాస్టర్‌లే. ‘వారసుడు’(Varasudu) సినిమా కాస్త ఆడినా కూడా అమ్మడి రోల్ అంతంత మాత్రమే. దీంతో కొత్త అవకాశాలు రావడమే కష్టంగా మారింది. ఈ సమయంలో అమ్మడికి బంపర్ ఆఫర్ వచ్చింది. హీరో నితిన్‌ (Nithiin) సరసన ఛాన్స్ కొట్టేసింది. ఈ కొత్త సినిమాకు తాజాగా పూజా కార్యక్రమాలు జరిగాయి. 

వెంకీ కుడుముల డైరెక్షన్లో నితిన్ హీరోగా రష్మిక మందన (Rashmika Mandanna) హీరోయిన్‌గా నటిస్తున్నారు . గతంలో ఈ కాంబినేషన్‌లో భీష్మ సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా మంచి కలెక్షన్స్‌ను రాబట్టుకుంది. అందుకేనేమో వెంకీ కుడుమల (Venky Kudumula) ఈ సారి కూడా తన హీరో, హీరోయిన్లుగా నితిన్ రష్మికలను ఎంచుకున్నారు. ఇక ఈ సినిమా ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) హాజరయ్యారు. నితిన్ – రష్మిక (Nithiin – Rashmika Mandanna) ముహూర్తం షాట్ ని తన క్లాప్ తో చిరు ప్రారంభించారు. ఇక్కడే ఓ ఆశ్చర్యకర విషయం జరిగింది.

Megastar Chiranjeevi at Nithiin-Rashmika Movie Launch Event

అసలే రష్మిక ఎక్కడా ఆగదు. మామూలుగానే అమ్మడి ఓవర్ యాక్షన్‌ని తట్టుకోలేం. అలాంటిది ఇక మెగాస్టార్ వస్తే అమ్మడిని పట్టుకోలేమోనని అంతా భావించారు. కానీ రష్మిక మాత్రం తనకేమీ పట్టనట్టు సైలెంట్‌గా కూర్చుండిపోయింది. ఇప్పుడిదే ఆసక్తికరంగా మారింది. రష్మిక ఎందుకు అంత సైలెంట్‌గా ఉండిపోయిందనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది. అమ్మడిపై వస్తున్న విపరీతమైన ట్రోలింగే కారణమని కొందరు అంటున్నారు. ఇప్పటికైనా మంచి పని చేసిందని కొదరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

Google News
థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!