#NTR30 నుంచి ఫోటో లీక్ అయ్యిందా? రిలీజ్ చేశారా? ఫ్యాన్స్‌కు పూనకాలే..

NTR 30

స్టార్ హారోల సినిమాలకు లీకులు కొత్తేమీ కాదు. నిజంగానే లీక్ అవుతాయో లేదంటే సైలెంట్‌‌గా చిత్ర యూనిటే రిలీజ్ చేస్తుందో తెలియదు కానీ ఫోటోలు లేదంటే వీడియోలు మాత్రం బయటకు వస్తుంటాయి. ఈ లీకుల బాధ పడలేకనే రాజమౌళి(Rajamouli) తన సెట్‌లోపలికి సెల్‌ఫోన్లను అలో చేయరు. ఇక ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ (Koratala Siva) ఓ సినిమాను రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్నారు. సినిమా లాంచింగ్ ఈవెంట్ తాజాగా జరిగింది.

ఎన్నో నెలలుగా వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమాను ఇక ఎట్టి పరిస్థితుల్లో ఆపబోమని చెప్పి ఎన్టీఆర్ (NTR) అభిమానుల్లో కొరటాల శివ(Koratala Siva) ఫుల్ జోష్‌ను నింపేశారు. ఈ తరుణంలో #NTR30 కి సంబంధించి ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. #NTR30 పేరుతో ఉన్న ఓ ట్యాంకర్‌.. దానిపై నుంచి బ్లడ్ కారుతోంది. అంటే ఎన్టీఆర్ (NTR) కోసం ఏకంగా బ్లడ్ ట్యాంకర్‌నే తెచ్చారా.. ఏంటనే చర్చ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున జరుగుతోంది.

ఎన్టీఆర్ (NTR) సినిమాల్లో భారీ యాక్షన్ సీన్స్ సర్వసాధారణంగా ఉంటూనే ఉంటాయి. ‘ఆర్ఆర్ఆర్’ (RRR) తీసుకుంటే ఏకంగా పులితో ఫైట్ పెట్టి సంచలనం సృష్టించారు. ఇక ఆ తరువాతి నుంచి వచ్చే సినిమాలకు అంతకు మించిన యాక్షన్ సన్నివేశాలు ఉండాలని ఫ్యాన్స్ కోరుకుంటారు కాబట్టి ఆ రేంజ్‌లోనే కొరటాల సైతం ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే NTR30 పేరుతో ఉన్న బ్లడ్ ట్యాంకర్ పిక్ ను అధికారికంగా విడుదల చేయలేదని.. షూటింగ్ స్పాట్ నుంచి లీకైందని అంటున్నారు. మొత్తానికి ఏం జరిగిందో కానీ ఈ పిక్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తోంది.

Google News
థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!