Surekha Vani: ఆయన మగతనంతో నాకేంటి పని.. వైఎస్ షర్మిల వీడియోపై సురేఖావాణి ఓ రేంజ్ లో..!

Surekha Vani

సురేఖా వాణి(Surekha Vani).. క్యారెక్టర్ ఆర్టిస్టులలో నిత్యం ట్రోల్స్‌కు గురయ్యే ఒకే ఒక్క నటి సురేఖా వాణి. ఆమె తన కూతురి (Surekha Vani daughter)తో కలిసి సోషల్ మీడియాలో చేసే హంగామా అంతా ఇంతా కాదు. పొట్టి పొట్టి దుస్తుల్లో ఓ రేంజ్‌లో పాటలకు స్టెప్పులేస్తూ అదరగొడుతూ ఉంటుంది. ఈ వయసులో పొట్టి పొట్టి దుస్తులేంటని కొందరు.. కూతురిని కూడా చెడగొడుతోందని మరికొందరు దుమ్మెత్తి పోస్తున్నారు. ఎవరేమనుకుంటే నాకేంటని సురేఖా వాణి మాత్రం అస్సలు తగ్గకుండా తన పోస్టులు తాను పెడుతూ పోతుంటుంది.

ఇక తాజాగా సురేషా వాణి చేసిన రీల్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ సారి సురేఖా వాణి (Surekha Vani)కి ఈ రీల్ విషయంలో మాత్రం మంచి మార్కులే పడ్డాయి. తాజాగా సురేఖా వాణి.. వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల(YS Sharmila)ను ఇమిటేట్ చేస్తూ ఓ వీడియో చేసింది. ఇది ఇప్పుడు సోషల్ మీడియాతో తెగ వైరల్ అవుతోంది. ఇటీవల షర్మిలకు సంబంధించిన ఒక ప్రెస్ మీట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. తను చేసిన కామెంట్స్ గురించి మీడియా ప్రశ్నించగా.. అవి తాను అనలేదని చెబుతున్న వీడియో అది.

“నేను అనలేదయ్యా చూపించు. ఆ వీడియో ఉంటే చూపించు.. నేను అనలేదు .. నేను అనలేదు.. నేను ఎందుకంటాను.. నాకు ఆయన మగతనంతో ఏంటి సంబంధం.. నేనెందుకు అనాలి.. నేను ఎందుకు మాట్లాడాలి .. అది ఆయన ..ఆయన భార్య చూసుకోవాలి కదా .. నాకేం సంబంధం ..” అని షర్మిల (YS Sharmila) ఓ సందర్భంలో అన్నారు. దీనిని సురేఖా వాణి రీల్ చేసింది. అసిస్టెంట్‌ను దగ్గరికి లాగి మరి సురేఖ వాణి (Surekha Vani) ఫన్నీగా ఈ డైలాగ్స్ చెప్పింది. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు సురేఖా వాణిపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

Surekha Vani daughter: ఇన్నర్ వేసుకోవడం మరిచానని బోల్డ్ ఆన్సర్ ఇచ్చిన సురేఖా వాణి కూతురు

Google News