Srikanth: విడాకుల వార్తలపై శ్రీకాంత్ క్లారిటీ.. తన భార్య బలవంతంగా ఫంక్షన్స్‌కి వస్తోందంటూ..

Hero Srikanth clarifies on divorce rumours

కొన్ని ఫేక్ న్యూస్ అనేవి సెలబ్రిటీల విషయంలో ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. నిజానికి అవి వారిని ఎంతలా ఇబ్బంది పెడతాయో.. వారి స్థానంలో ఉండి చూస్తే మాత్రమే అర్ధమవుతుంది. తాజాగా శ్రీకాంత్ (Srikanth Meka) చేసిన వ్యాఖ్యలు ఈ రూమర్స్ వల్ల వారు ఎదుర్కొనే ఇబ్బందులను కళ్లకు కట్టాయి. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి మంచి సక్సెస్ సాధించిన హీరోల్లో శ్రీకాంత్ (Srikanth) ఒకడు. పరిస్థితులకు తగ్గట్టు నిర్ణయాలు తీసుకుంటూ ఇండస్ట్రీలో చక్కగా నిలదొక్కుకున్నాడు.

హీరోగా మంచి క్రేజ్ ఉండగానే సహ నటి ఊహ (Ooha)ను శ్రీకాంత్ ప్రేమ వివాహం చేసుకున్నాడు. అప్పటి నుంచి ఊహ కూడా తన కెరీర్‌ను పక్కనబెట్టేసి పూర్తిగా ఫ్యామిలీకే లైఫ్‌ను అంకింతం చేశారు. పెళ్లి అయినప్పటి నుంచి ఆమె పెద్దగా బయట ఎక్కడా కనిపించలేదు. వీరికి ఇద్దరు పిల్లలు. శ్రీకాంత్ కుమారుడు సైతం హీరోగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. ఇలాంటి సమయంలో శ్రీకాంత్ (Srikanth), ఊహా (Ooha) విడిపోబోతున్నారంటూ ఓ న్యూస్ బాగా వైరల్ అయ్యింది.

Hero Srikanth family

తన విడాకులపై జరిగిన ప్రచారం తమను ఎంతలా ఇబ్బంది పెట్టిందో శ్రీకాంత్ (Srikanth Meka) తన పుట్టినరోజు సందర్భంగా ఒక యూట్యూబ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ఒకసారి తను చనిపోయినట్టు ప్రచారం చేశారని అలాంటివి చూస్తే తన తల్లిదండ్రులకి గుండెపోటు రావొచ్చని శ్రీకాంత్ (Srikanth) ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక విడాకుల విషయమై మాట్లాడుతూ.. ఫంక్షన్స్‌కి వెళ్లాలంటే తన భార్య పెద్దగా ఇష్టపడదని కానీ విడాకుల వార్తల నేపథ్యంలో ఫంక్షన్స్‌లో తనతో పాటు బలవంతంగా పాల్గొనాల్సి వస్తోందని శ్రీకాంత్ వాపోయాడు.

Google News
థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!