Samantha: వామ్మో.. సమంత బంగారు ఆభరణాలు 14 కోట్లా..!

Samantha Gold

స్టార్ హీరోయిన్ సమంత (Samantha) మయోసైటిస్ వ్యాధితో కొంతకాలం పాటు బాధపడి ప్రస్తుతం కోలుకుంది. ఇక మళ్లీ సినిమాలతో అమ్మడు ఫుల్ బిజీ అయిపోయింది. ఇప్పటికే ఈ ముద్దుగుమ్మ ఫోటో షూట్‌లతో ఫ్యాన్స్‌కి పూనకాలు తెప్పిస్తోంది. తాజాగా అమ్మడు చేసిన ఓ ఫోటో షూట్ చూసి ఫ్యాన్స్ అంతా సమంత (Samantha Ruth Prabhu) ఈజ్ బ్యాక్ అనుకున్నారు. అంత స్టైలిష్‌గా సామ్ తయారైంది. చాలా కాలం తర్వాత సామ్‌ను అలా చూసి నెటిజన్లు అవాక్కయ్యారు.

ఇక తెలుగు చిత్రసీమ విషయానికి వస్తే.. ఒక్కో దర్శకుడికి ఒక్కో స్టైల్ ఉంది. అలాగే దర్శకుడిగా గుణశేఖర్‌ (Gunasekhar)కు కూడా ఒక స్పెషల్ స్టైల్ ఉంది. సినిమాపై ఆయనకున్న ప్యాషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే తనను తాను ప్రూవ్ చేసుకున్నారు. సహజత్వం కోసం నిరంతరం శ్రమించే ఆయన దాని కోసం ఎంతటి ఖర్చుకు కూడా వెనుకాడరు. ప్రస్తుతం ఆయన ‘శాకుంతలం’(Shaakuntalam) సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో సమంత ప్రధాన పాత్రలో నటిస్తోంది.

Samantha In Shaakuntalam

శాకుంతలం(Shaakuntalam) అనగానే ఒక పౌరాణిక సినిమాలా అనిపిస్తోంది కదా. మరి ఈ సినిమాలో కాస్ట్యూమ్స్ ఎలా ఉండాలి? ముఖ్యంగా ఆభరణాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. బంగారు ఆభరణాలు, వజ్రాలతో వాటిని రూపొందించారు. వాటి విలువ సుమారు రూ.14 కోట్లు అట. ఈ ఆభరణాల తయారీకి ప్రముఖ డిజైనర్‌ నీతూ లుల్లా ఏడు నెలల పాటు శ్రమించారు. 15 కేజీల బంగారాన్ని ఆభరణాల తయారీ కోసం వాడారట. 14 రకాల ఆభరణాలు.. 14 కోట్లు ఖర్చు అంటే వావ్ కదా. ఏప్రిల్ 14న ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది.

Google News
థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!