మంత్రితో హీరోయిన్ డేటింగ్.. ఫోటోలు, వీడియోలు వైరల్!

Actress Dating Minister

ప్రముఖ నటి పరిణీతి చోప్రా (Parineeti Chopra), ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Aadmi Party) (ఆప్) (AAP) ఎంపీ రాఘవ్ చద్దా (Raghav Chadha) పీకల్లోతు ప్రేమలో ఉన్నారంటూ బాలీవుడ్ కోడై కూస్తోంది. వీరిద్దరూ కలిసి లంచ్, డిన్నర్ సమయంలో తీసుకున్న ఫోటోలు వైరల్ కావడంతో వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జోరుగా సాగుతోంది. వీరిద్దరూ కలిసి ముంబైలో రెస్టారెంట్ నుంచి బయటకు వస్తూ తీసుకున్న ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. రాఘవ్ (Raghav Chadha) మాత్రం నేరుగా కారు వద్దక వెళ్లిపోగా.. పరిణీతి మాగ్రతం ఫోటోలకు ఫోజులిచ్చి మీడియాతో ముచ్చటించింది.

ఆంగ్ల మీడియా కథనం ప్రకారం.. పరిణీతి(Parineeti Chopra), రాఘవ(Raghav Chadha)లు మంచి స్నేహితులు. వారిద్దరూ డేటింగ్‌లో ఏమీ లేరు. ఇద్దరూ కలిసి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్‌లో కలిసి చదువుకున్నారు. ఈ క్రమంలో వారిద్దరికీ స్నేహం కుదిరింది. బుధవారం రాత్రి కూడా వీరిద్దరూ మీడియా కంటపడ్డారు. వీరి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. వీరిద్దరూ కలిసి ఫోటోలకు ఫోజులివ్వడం విశేషం.

Parineeti Chopra Mp Raghav

పరిణీతి(Parineeti Chopra) బాలీవుడ్‌లో లేడీస్ వర్సెస్ రికీ బహ్ల్ సినిమాతో అడుగుపెట్టింది. బోమన్ ఇరానీ, అమితాబ్ బచ్చన్, డానీ డెన్జోంగ్పా, అనుపమ్ ఖేర్, సారికలతో కలిసి ఆమె చివరిసారిగా సూరజ్ బర్జాత్యా రూపొందించిన మల్టీ-స్టారర్ మూవీ ఉంచైలో కనిపించింది. ప్రస్తుతం ఆమె చమ్కిలా అనే మూవీ కోసం సిద్ధమవుతోంది. ఇది 80ల నాటి పంజాబీ పాప్‌స్టార్ జంట- అమర్ సింగ్ చమ్కిలా, అమర్‌జోత్ కౌర్‌పై బయోపిక్. 1988లో మెహసంపూర్ విలేజ్‌లో వీరిద్దరూ హత్యకు గురయ్యారు.

Google News