Manchu Vishnu vs Manoj: మంచు ఫ్యామిలీలో గొడవ.. రచ్చకెక్కిన విష్ణు, మనోజ్‌ల వ్యవహారం

Manchu Vishnu Manoj

మంచు విష్ణు (Manchu Vishnu), మనోజ్‌ (Manchu Manoj) మధ్య వివాదం రచ్చకెక్కింది. అన్న విష్ణుతో వివాదాన్ని మంచు మనోజ్ స్టేటస్‌ పెట్టడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. విష్ణు, మనోజ్‌ల మధ్య గత కొంతకాలంగా వేభేదాలు చోటు చేసుకున్నాయి. వీరిద్దరూ వేర్వేరు ఇళ్లలో నివాసం ఉంటున్నారు. మనోజ్ (Manchu Manoj) పెళ్లికి కూడా విష్ణు గెస్ట్‌లా ఒక 15 నిమిషాలు వచ్చి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య విభేదాలు మరింత ఎక్కువైనట్టు తెలుస్తోంది. తాజాగా మనోజ్ (Manoj) అనుచరుడితో విష్ణు గొడవపడటం మనోజ్‌కు విపరీతమైన కోపం తెప్పించినట్టు తెలుస్తోంది.

అన్న వ్యవహార శైలిని మనోజ్(Manchu Manoj) ఫేస్‌బుక్ స్టోరీ పోస్ట్‌ ద్వారా బయట పెట్టడంతో ఇప్పుడు కొత్త చర్చకు దారితీసింది. వీడియో గమనిస్తే అందులో ‘నా ఇష్టం’ ..‘వాడేదో అంటున్నాడు కదా’ అని విష్ణు (Manchu Vishnu) అంటున్నాడు. ‘ఇదండి అసలు విషయం ఇలా ఇంటికి వచ్చి మా వాళ్లను కొడుతుంటాడు’ అంటూ మనోజ్(Manchu Manoj) చెబుతున్నాడు. అసలు వీరి మధ్య గొడ‌వేంటో తెలియాల్సి ఉంది. తన మనిషి సారథిని విష్ణు కొట్టడంపై మనోజ్ ఫుల్ ఫైర్ అయ్యాడు. మంచు ఫ్యామిలీ (Manchu Family)కి సన్నిహితంగా ఉంటూ వస్తున్నాడు.

Manchu Vishnu vs Manoj

ఇక ఇటీవలి కాలంలో అయితే మనోజ్‌(Manchu Manoj)కు సారథి మరింత దగ్గరయ్యాడు. ఈ క్రమంలో సారథి ఇంటికెళ్లి అతన్ని కొట్టబోయాడు మంచు విష్ణు. ఇది మనోజ్‌కు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మంచు మనోజ్.. తాజాగా డయల్ 100కి సైతం కాల్ చేశాడు. దీంతో పోలీసులు ఆయన ఇంటికి వెళ్తున్నారు. మనోజ్, విష్ణుపై కేసు పెట్టే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి: Manchu Vishnu: ఒక్క విష్ణు తప్ప.. మిగిలిన వాళ్లందరిదీ ఒకటే దారి.. సేమ్ సీన్ రిపీట్

Google News
థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!