ఎన్టీఆర్ లైఫ్‌లో ఎప్పటికీ ఆ లోటు ఉంటుందట.. అదేంటంటే..

ఎన్టీఆర్ లైఫ్‌లో ఎప్పటికీ ఆ లోటు ఉంటుందట.. అదేంటంటే..

యంగ్ టైగర్ ఎన్టీఆర్.. సినిమాల మాదిరిగానే తనను తాను పూర్తిగా మార్చుకున్న హీరో. ఆది, సింహాద్రి వంటి పలు సినిమాల్లో ఎన్టీఆర్‌కు ఇటీవలి కాలంలో వచ్చిన సినిమాల్లో ఎన్టీఆర్‌కు చాలా వ్యత్యాసం ఉంది. అయితే డ్యాన్స్‌ల పరంగా మాత్రం అప్పుడూ ఇప్పుడూ ఒకేలా ఉన్నాడు. ఇవాళ ఎన్టీఆర్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా యంగ్ టైగర్ గురించి కొన్ని ఆసక్తికర వియాలు.. తొలుత తారక్‌ రామ్‌గా ఉన్న ఎన్టీఆర్ పేరును నందమూరి తారక రామారావుగా మార్చింది ఆయన తాతగారు ఎన్టీఆరే. 

భార్య, ఇద్దరు పిల్లలతో ఎన్టీఆర్ లైఫ్ ఆనందంగా సాగిపోతున్నా కూడా కుమార్తె లేదనే లోటు మాత్రం ఉందని గతంలో ఓసారి తెలిపారు. ఎనిమిదేళ్ల వయసులోనే ఎన్టీఆర్ సినిమాల్లోకి అడుగు పెట్టాడు.  ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’లో భరతుడి పాత్రతో ఆరంగేట్రం చేశాడు. ఆ తరువాత కొన్నాళ్లకు ‘బాల రామాయణం’ చేశాడు. కూచిపూడి నృత్యంలో శిక్షణతో ఎన్టీఆర్‌కు డ్యాన్స్ పట్ల మక్కువ పెరిగింది. ఎన్టీఆర్ డ్యాన్స్ కోసమే సినిమాకు వెళ్లే వాళ్లున్నారంటే అతిశయోక్తి కాదు. ఆ తరువాత 2001లో ‘నిన్ను చూడాలని’తో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. 

ఇప్పటి వరకూ 29 చిత్రాల్లో నటించిన ఎన్టీఆర్.. ‘దేవర’ అనే టైటిల్‌తో 30వ సినిమా చేస్తున్నాడు. అటు బాలీవుడ్‌లోనూ అడుగు పెట్టాడు. హృతిక్‌ రోషన్‌తో కలిసి ‘వార్‌ 2’లో నటిస్తున్నాడు. ‘ఫోర్బ్స్‌ ఇండియా’ సెలబ్రిటీ లిస్ట్‌లో రెండు సార్లు చోటు దక్కించుకున్న ఘనత ఎన్టీఆర్‌ది. వెండితెరపైనే కాకుండా బుల్లితెరపై కూడా ఎన్టీఆర్ సక్సెస్ అయ్యాడు. ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’, ‘బిగ్‌బాస్‌ తెలుగు’ షోలకు హోస్ట్‌గా వ్యవహరించి హోస్టింగ్‌లో తనకు తానే సాటి అనిపించుకున్నాడు.

Google News