రేవ్ పార్టీలో లేను.. ఫామ్ హౌస్‌లో ఎంజాయ్ చేస్తున్నా: నటి హేమ

రేవ్ పార్టీలో లేను.. ఫామ్ హౌస్‌లో ఎంజాయ్ చేస్తున్నా: నటి హేమ

బెంగళూరు శివారులో నిర్వహించిన రేవ్‌ పార్టీతో తనకు ఎలాంటి సంబంధం లేదని సినీనటి హేమ స్పష్టం చేశారు. బెంగుళూరు శివారులో జరిగిన రేవ్ పార్టీలో నటి హేమ ఉన్నట్టు కన్నడ మీడియాలో వార్తలు వెలువడ్డాయి. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. తెలుగు మీడియా.. వెబ్‌సైట్స్ ఈ విషయాన్ని హైలైట్ చేయడంతో సెకన్లలో హేమ పేరు తెలుగు రాష్ట్రాల్లోనూ.. నెట్టింట మారు మోగింది. దీంతో హేమ ఓ ప్రత్యేక వీడియోను విడుదల చేసింది.

తాను ఎక్కడికీ వెళ్లలేదని.. హైదరాబాద్‌లోనే ఉన్నానని తెలిపింది. హైదరాబాద్‌లోని ఫామ్‌హౌస్‌లో ఎంజాయ్‌ చేస్తున్నానని వెల్లడించింది. తనపై వస్తోన్న వార్తల్లో ఎలాంటి నిజమూ లేదని నమ్మవద్దని కోరింది. అసలు అక్కడ ఎవరు ఉన్నారో కూడా తనకు తెలియదని.. దయచేసి మీడియాలో తనపై వచ్చే వార్తలను నమ్మవద్దని హేమ విజ్ఞప్తి చేసింది. బెంగుళూరు శివారులో ఓ వ్యాపారవేత్తకు చెందిన ఫామ్‌ హౌస్‌లో నిర్వహించిన రేవ్‌ పార్టీలో పలువురు తెలుగు టీవీ నటీనటులు, మోడళ్లు పట్టుబడ్డారు.

దాదాపు 100 మందికి పైగా పార్టీకి హాజరవగా.. వారిలో 70 మంది పురుషులు.. మిగిలిన వారంతా స్త్రీలు కావడం గమనార్హం. ఈ రేవ్ పార్టీ కోసం హైదరాబాద్ నుంచి కొందరు యువతులను ఫ్లైట్‌లో బెంగుళూరుకు తరలించారని సమాచారం. పార్టీలో మందుతో పాటు డ్రగ్స్‌ వాడినట్లు పోలీసులు గుర్తించారు. మొత్తానికి రేవ్ పార్టీ ఏమో కానీ నటి హేమ మాత్రం ఒక్కసారిగా పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది.