కట్టెల పొయ్యిపై టీ పెట్టిన మెగా కోడలు.. పిక్స్ వైరల్

కట్టెల పొయ్యిపై టీ పెట్టిన మెగా కోడలు.. పిక్స్ వైరల్

మెగా కోడలు లావణ్య త్రిపాఠి పెళ్లి తర్వాత కూడా లైఫ్‌ను తెగ ఎంజాయ్ చేస్తోంది. పెళ్లికి ముందు కంటే.. ఇప్పుడు లావణ్య ఏ పోస్ట్ పెట్టినా కూడా నెట్టింట పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌ను వివాహం చేసుకున్నా కూడా ఆమె పర్సనల్ లైఫ్ విషయంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటోంది. 

వరుణ్ తేజ్‌తో పెళ్లి తర్వాత కూడా సినిమాలు, వెబ్ సిరీస్ చేస్తోంది. తాజాగా వరుణ్ తేజ్‌తో పాటు కొందరు స్నేహితులతో కలిసి లావణ్య వెకేషన్‌కు వెళ్లింది. ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ తెగ ఎంజాయ్ చేస్తోంది. ఆమె వెళ్లిన చోట ఓ కొండ దగ్గర కట్టెల పొయ్యి పెట్టి మరీ టీ పెట్టుకుని తాగారు. దానికి సంబంధించిన పిక్స్ పోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. 

ఆమె నటించిన మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ మంచి సక్సెస్ సాధించింది. బిగ్‌బాస్ విన్నర్ అభిజిత్ ఈ వెబ్ సిరీస్‌లో హీరోగా చేశాడు. అతిశుభ్రతను ఇష్టపడే అమ్మాయి, రొటీన్‌ జీవితంలోనే ఆనందాన్ని వెతుక్కునే అబ్బాయి. ఈ ఇద్దరి మధ్య ప్రేమే మిస్‌ పర్‌ఫెక్ట్‌. ఈ లవ్ స్టోరీ యూత్‌కి బాగా కనెక్ట్ అయ్యింది. ఎక్కడా వల్గారిటీకి ఛాన్స్ లేకుండా లావణ్య మంచి సక్సెస్ కొట్టింది.