ప్రమాదానికి గురైన జబర్దస్త్ కమెడియన్..

ప్రమాదానికి గురైన జబర్దస్త్ కమెడియన్.. 

జబర్దస్త్ కమెడియన్ పవిత్ర ఇవాళ పెను ప్రమాదం నుంచి బయటపడింది. ఆమె ప్రయాణిస్తున్న కారు దారుణ ప్రమాదానికి గురైంది. అయితే ఇది తాజాగా జరిగిన ప్రమాదమేమీ కాదు. ఈ నెల 11న సొంతూళ్లో ఓటు వేసేందుకు వెళుతుండగా జరిగింది. పవిత్ర ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న పొదల్లోకి దూసుకెళ్లింది. కారు ముందరు టైర్ ఊడిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది.

కారు మొత్తం దారుణంగా పాడైపోయింది. అయితే పవిత్ర ఈ ప్రమాదం జరిగిన తీును గుర్తు చేసుకుంటూ దానికి సంబంధించిన వీడియోతో పాటు ఓ ఎమోషనల్ వీడియోను షేర్ చేసింది. పవిత్ర జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకుంది. ప్రస్తుతం పలు టీవీ షోలు కూడా చేస్తూ కెరీర్ పరంగా బాగా బిజీ అయిపోయింది.

ప్రమాదానికి గురైన జబర్దస్త్ కమెడియన్.. 

అయితే ఈ నెల 11న తన ఓటు హక్కు వినియోగించుకునేందుకని తన సొంతూరైన సోమశిలకు హైదరాబాద్ నుంచి కారులో తన బంధువులతో కలిసి బయలుదేరింది. నెల్లూరు ఉప్పలపాడు హైవేపై ఎదురుగా వస్తున్న ఓ కారు వీళ్ళ కారును ఢీ కొట్టింది. ప్రమాద తీవ్రతకు పవిత్ర కారు ముందు టైరు ఊడిపోవడంతో రోడ్డు పక్కనే ఉన్న పొదల్లోకి దూసుకెళ్లింది. అయితే వెంటనే ఎయిర్ బెలూన్స్ తెరుచుకోవడంతో పవిత్ర, ఆమె బంధువులు ప్రమాదం నుంచి బయటపడ్డారు. అయితే తాను ఇష్టపడి ఆ కారును కొనుక్కున్నానని.. అది పాడైపోయిందని తెలిపింది.