కెరీర్ ఖతం అనుకుంటున్న టైంలో అదిరిపోయే ఛాన్స్ పట్టేసిన పూజా హెగ్డే..

కెరీర్ ఖతం అనుకుంటున్న టైంలో అదిరిపోయే ఛాన్స్ పట్టేసిన పూజా హెగ్డే..

తెలుగింటి బుట్టబొమ్మ.. దెబ్బకు ఫేడ్ అవుట్ అయిపోయింది. వరుస ఫ్లాప్‌లతో పత్తా లేకుండా పోయింది. ఒకానొక టైంలో టాలీవుడ్ టు బాలీవుడ్ కాళ్లకు చక్రాలు పట్టుకుని మరీ తిరిగిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు ఏ ఉడ్‌లో అవకాశం వస్తుందా? అని ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక పూజా పాప కెరీర్ ఖతం అని అందరూ ఫిక్సైన  టైంలో అమ్మడికి  క్రేజీ ఆఫర్ వెదుక్కుంటూ చెంతకు చేరింది.

కోలీవుడ్‌ స్టార్ సూర్య సరసన ఈ ముద్దుగుమ్మ అవకాశం కొట్టేసిందని టాక్. సూర్య ప్రస్తుతం ‘కంగువ’ మూవీ చేస్తున్నాడు. ఇది ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే సూర్య తన 44వ చిత్రానికి సైతం సిద్ధమవుతున్నాడు. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంతో పాటు ఈ చిత్రానికి నిర్మాతగా కూడా వ్యవహరించబోతున్నారు. సూర్య సొంత నిర్మాణ సంస్థ 2డీ ఎంటర్‌టెయిన్‌మెంట్స్‌తో కలిసి సుబ్బరాజ్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

కెరీర్ ఖతం అనుకుంటున్న టైంలో అదిరిపోయే ఛాన్స్ పట్టేసిన పూజా హెగ్డే..

ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. అయితే మన బుట్టబొమ్మ పూజా పాప ఈ సినిమాకు హీరోయిన్‌గా ఎంపికైందట. అసలే అవకాశాల్లేక అల్లాడుతున్న ఈ ముద్దుగుమ్మకు ఇది నిజంగా బంపరాఫర్ అనే చెప్పాలి. ఈ ముద్దుగుమ్మ  ‘మాస్క్’ అనే తమిళ సినిమాతోనే హీరోయిన్‌గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు ీ తమిళ్ సినిమా అమ్మడిని నిలబెడితే నిలబెట్టాలి. లేదంటే కష్టమే..

Google News