వెంకీ ఇంట పెళ్లి సందడి.. పిక్స్ వైరల్..

వెంకీ ఇంట పెళ్లి సందడి.. పిక్స్ వైరల్..

విక్టరీ వెంకటేష్ ఇంట పెళ్లి హడావుడి ప్రారంభమైంది. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ సందడి చేస్తున్నాయి. వెంకీ చిన్న కూతురు హవ్యవాహిని పెళ్లి  విజయవాడకు చెందిన డాక్టర్ నిశాంత్‌తో జరిగింది. గత ఏడాది అక్టోబర్‌లోనే వీరి ఎంగేజ్‌మెంట్ జరిగింది. ఇక ఇవాళ (మార్చి 15)న రామానాయుడు స్టూడియోస్‌లో హవ్య వాహిని పెళ్లి వేడుకకు ఏర్పాట్లను కుటుంబ సభ్యులు పూర్తి చేశారు.

వెంకీ ఇంట పెళ్లి సందడి.. పిక్స్ వైరల్..

హవ్యవాహిని ఎంగేజ్‌మెంట్ చాలా గ్రాండ్‌గా జరిగింది. మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు వంటి స్టార్ హీరోలంతా ఈ ఎంగేజ్‌మెంట్ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇక పెళ్లి సైతం చాలా గ్రాండ్‌గా జరగనుంది. ప్రి వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌లో భాగంగా జరిగిన మెహందీ ఈవెంట్‌కు మహేష్ బాబు సతీమణి అయిన నమ్రత, అలాగే కూతురు సితారలు హాజరై సందడి చేశారు.

Advertisement
వెంకీ ఇంట పెళ్లి సందడి.. పిక్స్ వైరల్..

మెహందీ వేడుకకు సంబంధించిన పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక వెంకీ తన కుటుంబాన్ని ఇండస్ట్రీకి దూరంగా ఉంచుతారన్న విషయం తెలిసిందే. ఆయన ఫ్యామిలీ పిక్స్ ఎప్పుడూ బయటకు రానివ్వరు. ఇలాంటి వేడుకల సమయంలోనే వస్తుంటాయి. చివరకు పిల్లల పెళ్లిళ్లు సైతం ఇండస్ట్రీకి సంబంధం లేని వారితోనే వెంకీ జరిపిస్తున్నారు. ఈ పెళ్లి వ్యవహారంలో ఆది నుంచి నిర్మాత, వెంకీ సోదరుడు సురేష్ బాబే అన్ని విషయాలు దగ్గరుండి మరీ చూసుకుంటున్నారట.