సింపతీ కోసం నాటకాలాడుతానని నిందించారు… సమంత కామెంట్

సమంతకి ఇప్పుడు జాతీయస్థాయిలో పాపులారిటీ ఉంది. భర్త నుంచి విడిపోయాకే ఆమెకి నేషనల్ లెవల్లో పేరు వచ్చింది. ఐతే, ఇప్పుడు తనని జనం చేస్తున్న ట్రోలింగ్ తో పోల్చితే ఇంతకుముందు ఇంకా ఎక్కువ నెగిటివ్ ఆర్టికల్స్ వచ్చేవి అని తాజాగా వెల్లడించింది.

సింపతీ కోసం నాటకాలు ఆడే అమ్మాయిని అని ముద్ర వేశారు అని చెప్పింది.

సమంత తాజాగా ఇండియా టుడే 2024 సదస్సులో పాల్గొంది. అక్కడ పలు విషయాలు మాట్లాడింది.

  • కెరీర్ మొదట్లో నాకు భయాలు ఎక్కువగా ఉండేవి. జనం నా గురించి ఏమనుకుంటున్నారో అని తెలుసుకునే ప్రయత్నం చేసేదాన్ని. మాటిమాటికీ సోషల్ మీడియా ఓపెన్ చేసే కామెంట్స్ చదువుతుండేదాన్ని.
  • అలాగే నన్ను సింపతీ క్వీన్ అనే పేరు తగిలించారు. జనం నా గురించి సానుభూతి చూపాలనే ఉద్దేశంతో అనేక ప్రయత్నాలు చేస్తాను అంటూ కామెంట్స్ చేశారు.
  • మొదట్లో చాలా బాధ వేసేది. కానీ ఆ తర్వాత వాటిని చదవడం మానేసి స్ట్రాంగ్ గా నిలబడ్డాను.
Samantha
  • మయోసిటిస్ సమస్య వచ్చినప్పుడు కూడా జనాలకు తెలియచెయ్యకూడదు అనుకున్నాను. సింపతీ కోసం ప్రయత్నిస్తున్నా అని అనుకుంటారు అని భావించా. కానీ చెప్పక తప్పలేదు. ఎందుకంటే ఆ సమస్య వచ్చినప్పుడే “యశోద” సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. నేను ప్రమోషన్స్ కి రాకపోతే సినిమా కిల్ అవుతుంది. అందుకే నా వ్యాధి గురించి జనాలకు చెప్పి, ఒక వీడియో ఇంటర్వ్యూ మాత్రమే ఇచ్చాను.
  • ఇప్పుడు నేను వ్యక్తిగా ఆనందంగా ఉన్నాను. నా ఎదుగుదల, నా పరిణతి నాకే గర్వంగా ఉంది.
Google News