ముద్రగడ… విలువలకు కాపుకాస్తున్న యోధుడు

Mudragada

ముద్రగడ పద్మనాభం గురించి పరిచయం అక్కర్లేదు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి తెలిసిన ప్రతి ఒక్కరి ఆయన సుపరిచితమే. దశాబ్దాలుగా తెలుగునాట రాజకీయాలను ప్రభావితం చేస్తున్న నేత. ఆయన విలువలకు కాపు కాస్తున్న యోధ

సొంత ప్రయోజనాల కన్నా కాపుల ప్రయోజనాలే ముఖ్యం అని ఏళ్లుగా పోరాటం చేస్తున్నారు. కాపు ఉద్యమం కోసం పదవులు త్యాగం చేసిన గొప్ప నాయకుడు. గత ప్రభుత్వం ముద్రగడని, ఆయన కుటుంబ సభ్యులను పోలీసులతో అరెస్ట్ చేయించినా బెణకలేదు.

ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ఘోరంగా ఓడిపోయారు. గోదావరి జిల్లా ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి బలమైన ప్రాంతం. కానీ ముద్రగడ అరెస్ట్ తర్వాత అక్కడ కంచుకోటకు బీటలు వారాయి. ఆయన అరెస్ట్ తో కాపుల్లో చంద్రబాబు పట్ల తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది.

తమ కాపు నాయకుడు ముఖ్యమంత్రి కావాలనేది ఆయన కోరిక. ఆ ఉద్దేశంతోనే ఆయన మొదట పవన్ కళ్యాణ్ ని సమర్ధించారు. ముద్రగడ కూడా జనసేన పార్టీలో చేరతారని అందరూ భావించారు. ముద్రగడని కలిసి తాను స్వయంగా పార్టీలోకి రమ్మంటాను ని పవన్ కళ్యాణ్ కూడా అన్నారు. కానీ జనసేనలో ముద్రగడ చేరకుండా చంద్రబాబు అడ్డుకున్నారని, జనసేనలో కీలకమైన నాదేండ్ల మనోహర్ చంద్రబాబుకు అనుకూలంగా ముద్రగడకి వ్యతిరేకంగా పనిచేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

అలాగే తాడేపల్లిగూడెం సభలో పవన్ కళ్యాణ్ కాపు ఉద్యమ సారధులైన ముద్రగడ పద్మనాభం, చేగోండి హరిరామజోగయ్యలను పరోక్షంగా కామెట్ చేయడంతో సీను మొత్తం మారింది. ముద్రగడ కూడా జనసేన నాయకుడు కాపుల సంక్షేమం కోసం కాకుండా చంద్రబాబుని మళ్ళీ అధికారంలోకి తీసుకురావాలనే లక్ష్యంతోనే రాజకీయాలు చేస్తున్నారు అని అర్థం చేసుకున్నట్లు కనిపిస్తోంది. అందుకే ఆయన జగన్ పార్టీలో చేరారు.

ముద్రగడ చేరడం వైసీపీకి బలం చేకూరనుంది. ఉభయ గోదావరి జిల్లాల్లో కాపులే ఎక్కువ. పద్మనాభం అంటే కాపుల్లో ప్రత్యేకమైన అభిమానం, గౌరవం ఉన్నాయి. ఆయన వైసీపీలో చేరడం, 2 ఎంపీ స్థానాలు, 19 ఎమ్మెల్యే స్థానాలను వైసీపీ కాపులకు కేటాయించడంతో ఇప్పుడు గోదావరి జిల్లాల్లో కూడా మొత్తం సీన్ మారిపోయింది.

Google News