Naga Chaitanya: నాగచైతన్యతో ఆ విషయంలో బేదాభిప్రాయాలు వచ్చాయి: విజయ్

Naga Chaitanya

ఉగ్రం సినిమా విషయమై దర్శకుడు విజయ్(Vijay) పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. నాగ చైతన్య(Naga Chaitanya)తో ఉన్న అభిప్రాయ బేధాలు.. అలాగే ఉగ్రం సినిమాకు సంబంధించిన పలు ఇంట్రెస్టింగ్ విషయాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. నాంది సినిమా మాదిరిగానే ఉగ్రం(Ugram) సినిమా కూడా నిజ సంఘటన ఆధారంగా రూపొందిందని విజయ్ తెలిపారు. అయితే ఈ సినిమాలో నరేష్(Naresh) హీరో అంటే జనం చూస్తారా? అని చాలా మంది అనుమానం వ్యక్తం చేశారట.

అయితే ఆ సినిమా చూసిన తర్వాత నరేష్ ఆ క్యరెక్టర్‌కి ఎంతలా సెట్ అయ్యాడనేది తెలుస్తుందని విజయ్(Vijay) తెలిపాడట. ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్‌ కథను ఉగ్రం(Ugram) మూవీగా రూపొందించినట్టు తెలిపారు. స్క్రీన్ ప్లే ముందు వెనుకకు వెళ్తూ వస్తుండటంతో సినిమా బోర్ కొట్టే అవకాశమే లేదన్నారు. అయితే సినిమా నిర్మాణ వ్యయం మాత్రం నైట్ షూట్ కారణంగా పెరిగిందని.. దానికి తానే బాధ్యుడినన్నారు. నిర్మాతలు సాహు, విజయ్ సైతం ఖర్చుకు వెనుకాడలేదన్నారు.

Ugram Telugu Movie

ఇక అక్కినేని నాగ చైతన్య(Naga Chaitanya)తో నాంది సినిమా గురించి విజయ్ మాట్లాడుతూ.. చైతుతో కొన్నాళ్లు ప్రయాణించిన మాట వాస్తవమేనన్నారు. అయితే సినిమా క్లైమాక్స్ విషయంలో ఇద్దరికీ బేదాభిప్రాయాలు తలెత్తాయట. దీంతో తమ జర్నీ ఆగిందని.. అయితే ఇది పూర్తిగా ఆగలేదని తామిద్దరం అనుకున్న క్లైమాక్స్‌ను పక్కనబెట్టేసి వేరొక కొత్త ఐడియాతో క్లైమాక్స్‌ను రూపొందించాలని భావిస్తున్నట్టు విజయ్(Vijay) పేర్కొన్నారు. అది చైతూకి ఇంకా వివరించాల్సి ఉందని తెలిపారు.

Google News