226 రోజులు.. 3,132 కి.మీ… ‘యువగళం’కు ముగింపు పలికిన నారా లోకేష్

226 రోజులు, 3,132 కి.మీ.దూరం... 'యువగళం'కు ముగింపు పలికిన నారా లోకేష్

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర నిన్న గాజువాక నియోజకవర్గం అగనంపూడి వద్ద ముగిసింది. ఈ సందర్భంగా పైలాన్ ఆవిష్కరించారు. ఈ ఏడాది జనవరి 27న కుప్పంలో ప్రారంభమైన యువగళం పాదయాత్ర మొత్తంగా 226 రోజులు, 3,132 కి.మీ.దూరం కొనసాగింది. గతంలో టీడీపీ అధినేత ‘వస్తున్నా మీ కోసం’ పాదయాత్ర ముగించిన ప్రదేశంలోనే యువగళం పాదయాత్రను నారా లోకేష్ ముగించారు. ఈ పాదయాత్రలో తానిచ్చిన హామీలన్నీ నెరవేరుస్తానని నారా లోకేష్ స్పష్టం చేశారు. అలాగే తన పాదయాత్రలో భాగస్వాములైన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.

ఇక నారా లోకేష్ ఆవిష్కరించిన పైలాన్‌లో లోకేష్ నిలువెత్తు చిత్రం.. పాదయాత్రలోని ముఖ్య ఘటనలు, సైకిల్ బొమ్మ, ఎన్టీఆర్‌, చంద్రబాబు, అచ్చెన్నాయుడు, పవన్‌ కల్యాణ్‌ చిత్రాలున్నాయి. అక్కడే తన తల్లి నారా భువనేశ్వరి, అత్త నందమూరి వసుంధర, ఇతర కుటుంబ సభ్యులతో నారా లోకేష్ సెల్ఫీ తీసుకున్నారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ.. అసమర్థుడు గద్దెనెక్కి ప్రజాస్వామ్యం చేస్తున్న దాడిని కళ్లారా చూశానన్నారు. తన లక్ష్యాన్ని చేరుకునేందుకు యువగళం కమిటీలు ఎంతగానో సహకరించారు. తన వెంటే ఉంటూ ఇబ్బందులకు వెనుకడుగు వేయకుండా రేయింబవళ్లు తనకు సేవలందించారని నారా లోకేష్ తెలిపారు.

226 రోజులు, 3,132 కి.మీ.దూరం... 'యువగళం'కు ముగింపు పలికిన నారా లోకేష్

ఇక యువగళం పాదయాత్ర చివరి రోజున పెద్ద ఎత్తున హంగామా నడిచింది. డబ్బు వాయిద్యాలు, బాణసంచా పేలుళ్ల నడుమ చివరి రోజు కొలాహలాంగా సాగింది. జగన్ అసమర్థ పాలనలో ఆత్మహత్య చేసుకున్న చేనేత కార్మికులకు పరిహారం అందించలేదు సరికదా.. కనీసం పరామర్శించనూ కూడా లేదన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ కుటుంబాలన్నింటినీ ఆదుకుంటామన్నారు. ద్విచక్ర వాహనాల మెకానిక్‌లకు జిల్లాకో శిక్షణ కేంద్రం.. అధునాతన పరికరాలు అందజేస్తామని  నారా లోకేష్ అన్నారు.

Google News