పవన్ హెచ్చరికలతో జనసైనికుల్లో కలవరం..

పవన్ హెచ్చరికలతో జనసైనికుల్లో కలవరం..

టీడీపీ అధినేత చంద్రబాబు ప్రభావం జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై పెద్ద ఎత్తున ఉందనడానికి ఇదే నిదర్శనం. అంతకు ముందు సాఫ్ట్‌గా ఉన్న పనవ్.. చంద్రబాబు పాలేరుగా మారిపోయారంటూ జనం విమర్శలు గుప్పిస్తున్నా పట్టించుకోవడం లేదు. పైగా తనను ఎవరేమన్నా ఓకే కానీ చంద్రబాబును అంటే మాత్రం సహించబోనంటూ అల్టిమేటం జారీ చేస్తున్నారు. సీఎం జగన్మోహన్‌రెడ్డిని ఓడించడమే లక్ష్యమని పైకి చెబుతున్నా తన అంతిమ ఆశయం మాత్రం చంద్రబాబుకు లబ్ధి చేకూర్చడమేనని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇష్టమైన వాళ్లు తనతో ఉండొచ్చని.. లేదంటే పోవచ్చని పవన్ స్పష్టం చేశారు.

ఈ లెక్కన చూస్తే పవన్ అమ్ముడుపోయారా?

Advertisement

పవన్ వైఖరితో జనసైనికులు ఆలోచనలో పడ్డారు. పదేళ్లుగా ఆయన వెంట ఉన్న కేడర్, ప్రజాభిమానాన్ని చూసే కదా.. చంద్రబాబైనా, ప్రధాని మోదీ అయినా ఆయనకు విలువ నిచ్చేది? ఆ విషయాన్ని మరిచి పదేళ్ల పాటు ఆయన వెన్నంటి ఉన్న కేడర్‌ ఉంటే ఉండడి.. పోతే పోండి అంటూ హుకుం జారీ చేయడం ఎంతవరకూ సబబు? ఈ లెక్కన చూస్తే పవన్ అమ్ముడుపోయారా? అనే అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి. అసలు పవన్ ఇలా చంద్రబాబుకు సరెండర్ అయిపోతే సీట్లు జనసేనకు ఇస్తారా? అసలు డిమాండింగ్ పొజిషన్‌లో ఉండాల్సింది పోయి దేబిరించే స్థాయికి తేవడమేంటని జనసేన నేతలు తలలు పట్టుకుంటున్నారు. మనమంతా పవన్ కోసం పోరాడుతుంటే.. అయన చంద్రబాబు పల్లకిని మోయడమేంటంటూ మండిపడుతున్నారు. అయితే కొంత కాలం వేచి ఉందామని అయినా పరిస్థితిలో మార్పు లేకుంటే ఎవరి దారి వాళ్లం చూసుకుందామని జనసేన కేడర్ భావిస్తోంది.

పవన్ హెచ్చరికలతో జనసైనికుల్లో కలవరం..

పవన్ వెనకాల వెళ్లి ఊడిగం చేయాలా?

ఏపీలో కమ్మ, కాపు సామాజిక వర్గాలకు ఏమాత్రం పడదు. ఇది ఈనాటి తంతు కాదు. ఎప్పటి నుంచో ఈ రెండు సామాజికవర్గాలు ఉప్పు నిప్పులా వ్యవహరిస్తున్నాయి. కాపు నాయకుడు వంగవీటి మోహన రంగా హత్య వెనుక చంద్రబాబు ఉన్నారంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ విషయాన్ని కాపు నాయకుడు చేగొండి హరిరామ జోగయ్య సైతం తానూ రాసిన పుస్తకంలో ప్రస్తావించారు. అలాగే అప్పట్లో కాపు నేత కన్నా లక్ష్మీనారాయణ తనను చంపేందుకు యత్నించారంటూ చంద్రబాబుపై ఆరోపణలు చేశారు.కానీ మళ్ళీ ఆయనే టీడీపీలో చేరారు. ఇలా ఆది నుంచి కమ్మ, కాపు సామాజికవర్గాలకు పడదు. దీంతో పవన్‌పై కాపు సామాజిక వర్గం మండిపడుతోంది. వ్యక్తిగత ప్రయోజనాల కోసం తమను తాకట్టుపెట్టడం దారుణమంటూ ఫైర్ అవుతున్నారు. చంద్రబాబు విదిల్చే అరకొర సీట్లకోసం తామంతా పవన్ వెనకాల వెళ్లి ఊడిగం చేయాలా? అని ప్రశ్నిస్తున్నారు. పవన్ సొంతంగా పోటీ చేసిన ఆ మాత్రం సీట్లు గెలుస్తారని దీనికి తమను తాకట్టు పెట్టడమేంటని మండిపడుతున్నారు.