ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికలు ఎప్పుడంటే… ?

ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికలు ఎప్పుడంటే… ?

ఏపీలో ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయనే దానిపై చర్చ బీభత్సంగానే జరుగుతోంది. ముందస్తు అని కొద్ది రోజులు ప్రచారం నడిచింది. అయితే షెడ్యూల్ ప్రకారమేనని తాము ముందస్తుకు వెళ్లేది లేదని వైసీపీ తేల్చి చెప్పింది. అయినా సరే.. ముందస్తు ఎన్నికల ప్రచారం ఆగలేదు. అయితే తాజాగా మాత్రం ఏపీ ఎన్నికలపై క్లారిటీ వచ్చింది. ముందస్తు లేదు.. వెనకస్తు లేదు. వైసీపీ చెప్పినట్టుగానే.. షెడ్యూల్ ప్రకారమే ఏపీలో ఎన్నికలు జరుగుతాయట.

లోక్‌సభతో పాటే ఏపీ ఎన్నికలు సైతం జరుగుతాయని తెలుస్తోంది. ఒడిషాకు సైతం ఇలాగే ఎన్నికలు ఉండనున్నాయి. సరే.. లోక్‌సభ ఎన్నికలంటే దశల వారీగా జరుగుతాయి కాబట్టి ఏపీలో ఏ దశలో ఉంటాయనేది తెలియదు. కానీ అన్ని పార్టీలు అటు అసెంబ్లీతో పాటు ఇటు లోక్‌సభ ఎన్నికలకు ఏకకాలంలో అభ్యర్థులను నిర్ణయించాల్సి ఉంటుంది. ఏది ఏమైనా ఏపీలో మాత్రం ఏప్రిల్‌లో అసెంబ్లీ ఎన్నికలు ఉండనున్నాయి.

Advertisement

గతంలో అయితే తొలి రెండు దశల్లోనే ఏపీ లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. కాబట్టి ఈసారి కూడా అలాగే ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే ఎన్నికలు ఎప్పుడనే విషయం ఏపీ ప్రభుత్వానికి క్లారిటీ ఉన్నట్టే సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయాలను బట్టి తెలుస్తోంది. టికెట్ల విషయంలో నేతలకు కూడా క్లారిటీ ఇస్తున్నారు. ఇంటర్, టెన్త్ పరీక్షలను సైతం మార్చి నెలాఖరు వరకూ పూర్తయ్యేలా చూసుకుంటోంది.  ఆపై వెంటనే పాఠశాలలను పోలింగ్ స్టేషన్ కోసం అధికారులు సిద్ధం చేయనున్నారు. ఈలోపే బడ్జెట్ సమావేశాలను కూడా నిర్వహించేలా ప్లాన్ చేస్తోంది ఏపీ ప్రభుత్వం.