సడీ సప్పుడు లేకుండా కవిత అరెస్ట్.. ఎప్పుడేం జరిగిందంటే..
ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆమెను ఈడీ అరెస్ట్ చేసింది. ఆమె అరెస్ట్ వ్యవహారమంతా ఎలాంటి హంగామా లేకుండా సడీ సప్పుడు లేకుండా జరిగిపోయింది. అసలు ఈడీ అధికారుల రాకను కవిత అయితే ఊహించను కూడా లేదు. పైగా గతంలో కవిత విచారణ అంటే ఆమె ఇంటి వద్ద చాలా హడావుడి ఉండేది. పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో చేరుకుంటారనే అనుమానంతో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసేవారు. బారికేడ్లే లేవు. అనుమతి లేని వారి రాకపోకలను అడ్డుకోవడాలు కూడా లేవు.
కవిత నివాసానికి దారితీసే రోడ్డును చాలా దూరంలోనే బారికేడ్లు ఏర్పాటు చేసి.. అనుమతి లేని వారి రాకపోకల్ని అడ్డుకునేవారు. కానీ, శుక్రవారం అలాంటి పరిస్థితులు కనిపించలేదు. ఇక నేడు 10:30 కు కవితను రౌజ్ అవెన్యూ కోర్టు ముందు ఈడీ అధికారులు హాజరుపరచనున్నారు. మధ్యాహ్నం 1.45 గంటలకు ప్రారంభమైన తనిఖీలు సాయంత్రం 6.45 గంటలకు ముగిశాయి. కారణాలన్నీ వివరిస్తూ 4 పేజీలను కవిత భర్త అనిల్‌కుమార్‌కు అందజేసి అనంతరం ఆమె అరెస్టును ధ్రువీకరిస్తూ ఈడీ సిబ్బంది ఇంటి గేటు వద్దకు వచ్చి చెప్పివెళ్లడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
అసలు ఎప్పుడేం జరిగిందంటే…
మధ్యాహ్నం 1.30 గంటలకు ఈడీ ప్రత్యేక బృందం రెండు వాహనాల్లో కవిత ఇంటికి చేరుకున్నారు.
4 గంటలకుపైగా సోదాలు నిర్వహించారు.. కవితను విచారించారు.
సాయంత్రం 5.20 గంటలకు కవితను అరెస్ట్‌ను ఈడీ అధికారులు ధృవీకరించారు.
6.45 గంటలకు ఈడీ తనిఖీలు ముగిశాయి.
సాయంత్రం 7.10 గంటలకు కవితతో శంషాబాద్ విమానాశ్రయానికి బయలుదేరారు.
రాత్రి 8.15 గంటలకు విమానాశ్రయానికి చేరుకుని 8.45 గంటలకు విమానంలో కవితను ఈడీ అధికారులు ఢిల్లీకి తీసుకెళ్లారు.