లోకేష్‌కు టీడీపీ పగ్గాలు.. ఇదే నిజమైతే..!!

లోకేష్‌కు టీడీపీ పగ్గాలు.. ఇదే నిజమైతే..!!

రాష్ట్రంలో ఎన్నికలు ముగిశాయి. అన్ని పార్టీలు ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. వైస్సార్సీపీ ఒక వైపు, టీడీపీ జనసేన కూటమి మరోవైపు గెలుపుపై ధీమాగా ఉన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

పార్టీ గెలిస్తే ఇది పక్కా..

సరే.. ఎవరి అంచనాలు వారికి ఉంటాయి. దీనిలో తప్పేమీ లేదు కానీ ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేయాలి..? ఎవరెవరికి ఏ పదవులు ఇవ్వాలి..? వంటి విషయాలపై తెగ చర్చించుకుంటున్నారు. ఇందులోనూ తప్పులేదు. ఏ పార్టీ అయినా చేసే పని ఇదే. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు సీఎం అవుతారని.. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు కీలక పదవి ఇస్తారని చెప్పుకుంటున్నారు. పార్టీ గెలిస్తే ఇది పక్కాగా జరిగి తీరుతుంది. కానీ నారా లోకేష్‌ను మాత్రం మంత్రి వర్గంలోకి తీసుకోకుండా టీడీపీ అధ్యక్ష పగ్గాలు అప్పగించాలనే డిమాండ్ వస్తోంది.

లోకేష్‌కు టీడీపీ పగ్గాలు.. ఇదే నిజమైతే..!!

పార్టీలో హాట్ టాపిక్‌గా ప్రతిపాదన..

మరి ప్రస్తుత టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడి పరిస్థితేంటంటారా? ఆయనకు కీలక పదవి ఇవ్వాలట. లోకేష్‌కు పగ్గాలు అప్పగిస్తేనే పార్టీ బతికి బట్టకడుతుందంటూ సీనియర్ నేత బుద్ధా వెంకన్న వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది. ఎన్నికలకు ముందే లోకేష్‌కు పగ్గాలు అప్పగించి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది కానీ ఎన్నికల ఫలితాలు వెలువడటానికి వారం రోజులే సమయం ఉన్నప్పుడు ఇలాంటి ప్రతిపాదన పార్టీలో హాట్ టాపిక్‌గా మారింది. బుద్దా వెంకన్న వ్యాఖ్యలపై తెలుగు తమ్ముళ్లలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయట. మొత్తానికి బుద్ధా వ్యాఖ్యలు టీడీపీలో పెద్ద ఎత్తున చర్చకు దారి తీశాయి.