స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్.. అసలేంటీ ప్రోగ్రాం..? స్కాం ఎలా జరిగింది?

స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్.. అసలేంటీ ప్రోగ్రాం..? స్కాం ఎలా జరిగింది?

స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం పేరుతో యువతకు నైపుణ్య శిక్షణ ఇస్తామని చెప్పి ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించకుండా నేరుగా దాదాపు రూ.241 కోట్లు కాజేసిన కేసులో చంద్రబాబును ఏపీ సీఐడీ అరెస్ట్ చేసింది. చంద్రబాబుతో పాటు ఈ వ్యవహారానికి సంబంధించి అప్పటి విద్యాశాఖ, స్కిల్ డెవలప్మెంట్ శాఖ మంత్రి గంటా శ్రీనివాస్, అయన కుమారుడు రవితేజను సైతం ఆంధ్రా సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. నేటి తెల్లవారుజామున నంద్యాల పర్యటనలో ఉన్న చంద్రబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన్ను విజయవాడ తీసుకొచ్చి కోర్టు ముందు హాజరు పరచనున్నారు.

2 నెలలకే స్కాం పురుడు పోసుకుంది..

2014లో చంద్రబాబు అధికారం చేపట్టారు. ఆ తరువాత 2 నెలలకే ఈ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాం పురుడుపోసుకుంది. ఈ పథకంలో భాగంగా బహుళజాతి సంస్థ అయిన సీమెన్స్ రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెడుతుందని, దీంతో పాటు యువతకు పలు నైపుణ్యాలు ఇచ్చే విషయంలో ప్రభుత్వానికి సహకరిస్తుందని, యువతకు శిక్షణ ఇస్తుందని అప్పటి ప్రభుత్వం పేర్కొంది. దీనికి గానూ మొత్తం ఈ పథకం ఖర్చు రూ.3,356 కోట్లని, ఇందులో ప్రభుత్వ వాటా 10 శాతం అని, 90 శాతం ఖర్చును కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ పథకం కింద సీమెన్స్‌ భరిస్తుందని చెప్పారు. అంటే దాదాపుగా రూ.౩వేల కోట్ల రూపాయలు సీమెన్స్‌ ఇస్తుందని ప్రభుత్వం చెప్పింది. ఈ క్రమంలో తమకు తాముగా తయారు చేసుకున్న అంచనా వ్యయాన్నే డీపీఆర్‌గా చూపిస్తూ స్కిల్‌డెవల్‌మెంట్‌ కార్పొరేషన్ నుంచి ప్రభుత్వానికి ఫైల్ పంపారు. దీంతో ఈ ఫైల్ సెక్రటరీ స్థాయి, ఆపై స్థాయి అన్నింటినీ ఓవర్‌రూల్‌ చేస్తూ కేబినెట్లోకి ఈనోట్‌ను తీసుకొచ్చారు. కేబినెట్లోకి అలా రావడం, వెంటనే దానికి ఓకే చెప్పడం, తర్వాత జీవో విడుదల కావడం… అన్నీ యమా స్పీడ్‌గా జరిగిపోయాయి.

స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్.. అసలేంటీ ప్రోగ్రాం..? స్కాం ఎలా జరిగింది?

కమీషన్ల కోసం ఆగమేఘాలపై నిధులు విడుదల

ఈ పథకంలో భాగంగా సీమెన్స్ ఇస్తానని చెప్పిన 90 శాతం నిధుల్లో ఒక్క రూపాయి కూడా ప్రభుత్వానికి రాకుండానే ఇటు నుంచి ప్రభుత్వం తన 10 శాతం వాటాను 5 దఫాలుగా మొత్తం రూ.371 కోట్లు విడుదల చేసింది. ఇలా అడ్డగోలుగా డబ్బు విడుదలపై ఆర్థికశాఖ అధికారులు అభ్యంతరాలు పెట్టారు. అయితే ఆ నిధుల విడుదల ఆపొద్దని వెంటనే విడుదల చేయాలంటూ చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు. ఈ విషయాన్ని స్వయంగా అప్పటి ఫైనాన్స్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ తన నోట్‌ఫైల్‌లో పేర్కొన్నారు. దీంతో డబ్బు విడుదలకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా నిధుల ప్రవాహం సాగిపోయింది. ఆశ్చర్యంగా అటు సీమెన్స్‌ సంస్థ కూడా అంతర్గత విచారణ జరిపి 164 సీఆర్పీసీ కింద ఏకంగా మెజిస్ట్రేట్‌ ముందు వాంగ్మూలం ఇచ్చారు. 

మూడేళ్లుగా విచారణ..

ప్రభుత్వం జారీచేసిన జీవోకు, ఎంఓయూకు ఎలాంటి సంబంధం లేదని సీమెన్స్ సంస్థ కోర్టుకు తెలిపింది. తమ కంపెనీలో పనిచేసే సుమన్‌బోస్‌ అనే వ్యక్తి మేనేజ్‌మెంట్‌ను గానీ, తమ న్యాయ విభాగాన్ని కానీ సంప్రదించలేదని సీమెన్స్‌ వాళ్లు కోర్టుకు తెలియజేశారు. అయితే ఈ క్రమంలో మొత్తం రూ.241 కోట్లను దాదాపు 70కిపైగా షెల్‌ కంపెనీల ద్వారా బయటికి తరలించేశారు. దీనిమీద మూడేళ్ళుగా సీఐడీ, ఈడీ విచారణ జరుపుతూ వస్తున్నాయి. ఇప్పటికే ఈ కేసులో కేసులో 8 మందిని అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన డిజైన్ టెక్ సంస్థకి చెందిన రూ.31 కోట్లు ఆస్తులు సైతం ఎటాచ్ చేశారు. ఇక ఈ కేసులో అప్పటి విద్యాశాఖ, స్కిల్ డెవలప్మెంట్ శాఖ మంత్రి గంటా శ్రీనివాస్, అయన కుమారుడు రవితేజను సైతం సీఐడీ అరెస్ట్ చేసింది.