చంద్రబాబు అరెస్టుకు ముందు.. తర్వాత ఏం జరిగింది!

Chandra Babu Arrest

నిన్న అర్ధరాత్రి నుంచే ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌కు రంగం సిద్ధమైంది. నంద్యాలలో చంద్రబాబు బస చేసిన ఫంక్షన్‌ హాల్‌ వద్ద పోలీసులు భారీగా మోహరించడంతో అరెస్ట్‌ చేయవచ్చన్న వార్తలకు బలం చేకూరింది. ఇక అంతే.. అటు పోలీసుల హడావుడి.. ఇటు టీడీపీ శ్రేణుల హడావుడి. వెరసి నంద్యాలలో హైటెన్షన్. క్షణక్షణం ఉత్కంఠ. నెక్ట్స్ పోలీసులు ఏం స్టెప్ తీసుకుంటారో.. ఎలా అడ్డుకోవాలని టీడీపీ శ్రేణులు కాచుకు కూర్చొన్నాయి. పోలీసు ఉన్నతాధికారులు అదనపు బలగాలను నంద్యాలకు పంపనున్నారన్న వార్తలతో అనుమానాలు మరింత పెరిగాయి. ఈ నేపథ్యంలోనే తెలుగు తమ్ముళ్లు హై అలర్ట్ అయిపోయారు.

అసలు ఇంత హడావుడిగా చంద్రబాబును అరెస్ట్ చేయడం వెనుక కారణం ఏంటి? ఏమైనా ఎఫ్‌ఐఆర్ నమోదైందా? పోనీ కనీసం కారణం కూడా చెప్పలేదు. చంద్రబాబు బస చేసిన బస్ వద్దకు వెళ్లి డోర్ కొడితే ఆయన బయటకు వచ్చారు. ఇక ఈ తరువాత ఆఘ మేఘాల మీద వైద్యులను రప్పించి చంద్రబాబుకు వైద్య పరీక్షలన్నీ చేయించడం క్షణాల్లో జరిగిపోయింది. అరే.. ఎందుకు అరెస్ట్ చేశారంటే చెప్పరు. ప్రాథమిక ఆధారాలేవంటే నీళ్లు నములుతారు. మొత్తానికి ఏదో ప్రభుత్వ ఆదేశాల మేరకే వచ్చాం కానీ తమ వద్ద ఆధారాలేమీ లేవన్నట్టుగా అధికారులు ప్రవర్తించడం విశేషం. ఇక అరెస్ట్ తర్వాత చంద్రబాబును ఎక్కడికో తీసుకెళుతున్నారో కూడా చెప్పలేదు. రూట్స్ మారుస్తూ చిత్ర విచిత్రాలకు పాల్పడుతున్నారు.

అసలు ఈ అరెస్ట్‌కు మెయిన్ కారణం ఏంటనేది ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్‌గా మారింది. అసలే ఏపీ సీఎం జగన్.. కక్షలు, కార్పణ్యాలు చాలా ఎక్కువ. మొండివాడు మాత్రమే కాదు.. ఏదనుకుంటే అది చేయాలనుకునే టైప్. తనను 16 నెలల పాటు చంద్రబాబు హయాంలో జైల్లో కూర్చోబెట్టారు కాబట్టి తను కూడా ఆయనను ఏదో విధంగా జైల్లో కూర్చోబెట్టాలనే పంతం తప్ప మరేమీ కనిపించడం లేదు. చక్కగా ముందే ప్లాన్ చేసి.. తను లండన్ వెళ్లాక అమలయ్యేలా స్కెచ్ గీసి మరీ వెళ్లారు. అనుకున్న ప్రకారమే చంద్రబాబును అరెస్ట్ చేయించారు. కానీ చంద్రబాబును ఎంత కాలం జైల్లో పెట్టగలరు? కక్షలు కార్పణ్యాలతో చేసే పనులు ఏ మేరకు సత్ఫలితాలను ఇస్తాయి? అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

Google News