ప్రశాంత్ కిషోర్ ఎంట్రీతో జనసేన డిమాండ్ ని డైవర్ట్ చేసిన చంద్రబాబు

ప్రశాంత్ కిషోర్ ఎంట్రీతో టాపిక్ డైవర్ట్ చేసిన చంద్రబాబు

తొందరపడి ఒక కోయిల ముందే కూసింది.. అనే పాట టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు సరిగ్గా సెట్ అవుతుంది. ఏదో ఎన్నికల తర్వాత తీరిగ్గా టీడీపీ-జనసేన కూటమి గెలిస్తే చంద్రబాబే సీఎం అని చెప్పొచ్చులే అని చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు కామ్‌గా ఉంటే లోకేష్ మాత్రం నోరు జారాడు. అప్పటి నుంచి రచ్చ మొదలైంది. ఇంతకాలం పార్టీ కోసం ఊడిగం చేసింది ఎవరినో సీఎంను చేయడానికా? అంటూ జనసైనికులు మూతి ముడుచుకుని కూర్చున్నారు.

జనసేన గ్రౌండ్ లెవల్ క్యాడర్‌లో అలయన్స్ మీద వ్యతిరేకత వచ్చింది. దీనిని డైవర్ట్ చేసే పనులో వెంటనే బీహార్ నుంచి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌ని చంద్రబాబు రంగంలోకి దింపారు. అడిగినంత డబ్బు ఇస్తే చాలు కేఏ పాల్ వెళ్లి అడిగినా కూడా సలహాలు ఇస్తారు. అలాంటిది చంద్రబాబుతో ప్రశాంత్ కిషోర్‌ భేటీ అవడం పెద్ద విశేషమేమీ కాదు కానీ ఒక్కసారిగా జనాల అటెన్షన్‌ని పీకేతో తన సమావేశం వైపునకు తిప్పగలిగారు. ఇది కదా మెయిన్ ట్విస్ట్. ఉరుములు, మెరుపులు లేని వర్షంలా ఒక్కసారిగా చంద్రబాబు ప్రశాంత్ కిషోర్‌తో భేటీ అయ్యారు.

ప్రశాంత్ కిషోర్ ఎంట్రీతో టాపిక్ డైవర్ట్ చేసిన చంద్రబాబు

శనివారం మధ్యాహ్నం గన్నవరం విమానాశ్రయంలో నారా లోకేశ్‌‌తో కలిసి ప్రశాంత్‌ కిషోర్‌ కనిపించడంతో ఒక్కసారిగా ఏపీలో అలజడి ప్రారంభమైంది. ఏదో జరగబోతోందంటూ ప్రచారం మొదలైంది. ప్రశాంత్ కిషోర్, నారా లోకేష్ కలిసి ఒకే వాహనంలో ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వెళ్లారు. పీకే ఒక్కరే కాదు.. షో టైమ్‌ కన్సల్టెన్సీ పేరిట టీడీపీకి రాజకీయ వ్యూహకర్తగా ఉన్న రాబిన్‌ శర్మ టీం సభ్యులు సైతం చంద్రబాబుతో సమావేశమవడం గమనార్హం. మొత్తానికి చంద్రబాబు ప్రశాంత్ కిషోర్‌ని సీన్‌లోకి ప్రవేశపెట్టి టాపిక్‌ను అయితే డైవర్ట్ చేశారు. 

Google News