చంద్రబాబు బెయిల్ కోసం చాలానే జరిగిందే.. వాట్ నెక్స్ట్.. ఇదీ అసలు కథ!!

చంద్రబాబు బెయిల్ కోసం చాలానే జరిగిందే.. వాట్ నెక్స్ట్.. ఇదీ అసలు కథ!!

నేనే తోపు.. నాలాంటి వాళ్ళు దేశంలో లేరు.. రాజకీయాల్లో నేనే సీనియర్.. నేను ఏం చేసినా ఒప్పే..! ఏం చేయడానికి అయినా నేను సిద్ధం.. అడ్డొస్తే ఖేల్ ఖతం..! ఇవన్నీ కాదు సింపుల్ గా చెప్పాలంటే.. నేను చెప్పిందే వేదం.. నా మాటే శాసనం..! ఇలా ఒకటి కాదు రెండు కాదు.. 40 ఏళ్లుగా చంద్రబాబు చేస్తున్న పని. ఇక వ్యవస్థలను మేనేజ్ చేయడం అంటారా..? బహుశా దేశంలోనే ఇప్పటి వరకూ ఎవరూ లేరు.. రాబోరు..

ఉండబోరు.. అదంతే..!

Advertisement

ఇన్నేళ్ళుగా వ్యవస్థలను మేనేజ్ చేసుకుంటూ పబ్బం గడిపిన చంద్రబాబు ఇన్నాళ్లకు చట్టానికి చిక్కి, జైల్లో అర్థశతదినోత్సవం చేసుకున్నారు. ఇందులో ఎలాంటి లొసుగులు ఉన్నా పట్టేసి ప్రభుత్వాన్నే ఇరుకున పెట్టే మనిషే.. కానీ అడ్డంగా దొరికిపోవడంతో చేసేదేమీ లేక.. చిన్న కోర్టుల నుంచి సుప్రీం కోర్టు వరకు చేయాల్సిన అన్నీ పనులు చేస్తూ వచ్చారు కానీ.. బాబు చేసిన నేరం తేలడంతో ఎక్కడా బెయిల్ వచ్చే అవకాశం కనుచూపు మేరలో కనిపించలేదు. దీంతో ప్లాన్- A ముగిసింది.

పక్కా వ్యూహంతో..!

అరెస్ట్ అయినా నెలన్నర రోజులుగా రాజమండ్రి జైల్లో ఉన్న చంద్రబాబు నాటి నుంచీ అనారోగ్యం పేరిట ఎల్లో మీడియాలో విస్తృతంగా ప్లాన్- B ని ప్రచారం చేస్తూ వస్తున్నారు. చర్మ సమస్యలు ఉన్నాయని, కంటి సమస్య ఉందని, బీపీ, దీర్ఘకాలిక అనారోగ్యాలు.. జైళ్లో భద్రత సరిగ్గా లేదని.. ఇలా లేనిపోని సాకులు చెప్పి ఎక్కడ చూసినా ఇదే హాట్ టాపిక్. బెయిల్ కోసం ఇలా పలు అంశాలను విస్తృతంగా ఎల్లో మీడియా ప్రచారం చేస్తూ ప్రజల్లో సానుభూతి కోసం ప్రయత్నిస్తూ వస్తోంది. అంతా అనుకున్నట్టే బాబుకు బెయిల్ వచ్చింది. సో.. దీని బట్టి చూస్తే ప్లాన్- B అక్షరాలా వర్క్ అవుట్ అయ్యింది. చంద్రబాబుకు ఉన్న ఆరోగ్య కారణాల రీత్యా ఎట్టకేలకు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేయడం జరిగింది.

ఇదీ అసలు కథ

ఇక్కడ గుర్తు పెట్టుకోవలసిన విషయం ఏమిటంటే చంద్రబాబుకు కేస్ మెరిట్స్ మీద బెయిల్ రాలేదు అన్నది. అంటే బాబు నిజంగా కోట్లు కొల్లగొట్టలేదు.. నిజాయితిపరుడు అని కానీ తప్పు చేయలేదు అని కానీ కోర్టు ఎక్కడా చెప్పలేదు. ఎందుకంటే బాబు తప్పు చేశాడని రుజువు అయ్యింది.. అందుకే ఇన్ని రోజులు జైలులో ఊచలు లెక్కెట్టారు. అంటే చేసేదేమీ లేక ఆకరికి అనారోగ్యాన్ని అడ్డు పెట్టుకొని బెయిల్ కోసం ప్రయత్నాలు చేశారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

చంద్రబాబు బెయిల్ కోసం చాలానే జరిగిందే.. వాట్ నెక్స్ట్.. ఇదీ అసలు కథ!!

లోకేష్ అదే పనిలో..!!

అవును.. నాన్నకు బెయిల్ వచ్చింది సరే ఏం చేయాలి అనే దానిపై న్యాయ నిపుణులతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సుదీర్ఘ చర్చలు జరుపుతున్నారు. ఏపీ హైకోర్టు మంజూరు చేసిన 4 వారాల బెయిల్ ని ఇంకొన్ని వారాలు ఎలా పొడిగించాలనే ఆలోచనలో నారా లోకేష్ ఉన్నారు. అదీ ఎలాగంటే.. ముందుగా కాటరాక్ట్ ఆపరేషన్ కి బాబు ఆరోగ్యం సరిగా లేదని 2 వారాల తరవాతే ఆపేరేషన్ చేయించుకునే ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ తర్వాత ఏదో ఒక సాకు చూపించి ఇంకోన్నీ వారాలు బెయిల్ పొడిగించి లాగా పిటిషన్ వెయ్యవచ్చు అని లోకేష్ కి లాయర్లు సలహా ఇచ్చినట్లు సమాచారం. మరోవైపు.. సుప్రీం కోర్టు క్వాష్ పిటిషన్ పై నిర్ణయాన్ని 20వ తేదీ వాయిదా వేయగానే 21న ఎల్వి ప్రసాద్ ఆసుపత్రి నుంచి ఉత్తరం తెరపైకి వచ్చిన విషయం అందరికి గుర్తుండే ఉంటుంది. చూశారుగా.. అర్థం అయ్యిందా రాజా..!!