Ambedkar Statue: ప్రపంచంలోనే అద్భుతం.. ఇసుకేస్తే రాలనంత జనం నడుమ జాతికి అంకితం..

ప్రపంచంలోనే అద్భుతం.. ఇసుకేస్తే రాలనంత జనం నడుమ జాతికి అంకితం.. 

జగన్ ప్రభుత్వం ఒక మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. విజయవాడ నగరం నడిబొడ్డున భారతరత్న డాక్టర్‌ బీఆర్‌.అంబేడ్కర్‌ సామాజిక న్యాయ మహాశిల్పాన్ని సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి శుక్రవారం ఆవిష్కరించి జాతికి అంకితం చేశారు. దీనికి జనం పెద్ద ఎత్తున తరలి వచ్చారు. స్టాట్యూ ఆఫ్‌ సోషల్‌ జస్టిస్‌‌ను ఏర్పాటు చేసి దేశ వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. అంబేడ్కర్‌ విగ్రహంతో ఇకపై బెజవాడకు ప్రత్యేక గుర్తింపు లభించనుంది. అంతేకాకుండా అంబేడ్కర్ స్మృతి వనం సందర్శనీయ స్థలాల్లో ఒకటిగా మారనుంది. ఇక ఈ సామాజిక న్యాయ మహా శిల్పాన్ని జాతికి అంకితం చేసే మహత్తర కార్యక్రమాన్ని గొప్పగా నిర్వహించింది.

Ambedkar Statue: ప్రపంచంలోనే అద్భుతం.. ఇసుకేస్తే రాలనంత జనం నడుమ జాతికి అంకితం.. 
ప్రపంచంలోనే అద్భుతం.. ఇసుకేస్తే రాలనంత జనం నడుమ జాతికి అంకితం.. 

మిన్నంటిన జైజగన్ నినాదాలు..

ఆంధ్రప్రదేశ్ రాస్ట్ర ప్రభుత్వ సాంఘిక సంక్షేమ శాఖ నోడల్ ఏజెన్సీగా అంబేడ్కర్‌ విగ్రహ నిర్మాణాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున జనం తరలివచ్చి ఈ మహత్తర కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. అంబేడ్కర్‌ మహా శిల్పం ఆవిష్కరణ మహోత్సవం స్వరాజ్‌ మైదానంలో అంబరాన్ని తాకింది. ఇసుకేస్తే రాలనంత మంది జనం నడుమ ఈ అద్భుతం ఆవిష్కృతమైంది. 18.81 ఎకరాల స్వరాజ్‌ మైదానంలో రూ.404 కోట్ల వ్యయంతో ప్రతిష్టాత్మకంగా స్మృతివనాన్ని తీర్చిదిద్దడం జరిగింది. ఇక సీఎం జగన్ ప్రసంగిస్తున్నంత సేపూ జై భీమ్, జై జగన్ నినాదాలతో స్వరాజ్ మైదానం దద్దరిల్లిపోయింది.

Ambedkar Statue 2

స్పెషల్ అట్రాక్షన్‌గా డ్రోన్ల ప్రదర్శన..

విజయవాడలో జగన్ ప్రభుత్వం నిర్మించిన అంబేడ్కర్ విగ్రహం ప్రపంచంలోనే అతి పెద్దది. 81 అడుగుల పీఠంతో కలిపి 206 అడుగుల పొడవు ఉంటుంది. ఇక విగ్రహావిష్కరణ కార్యక్రమంలో వందల సంఖ్యలో డ్రోన్లతో నిర్వహించిన ప్రదర్శన స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. అలాగే జాతీయ పక్షి నెమలి ఆకృతి, లేజర్ షో, బాణసంచా, నవరత్న పథకాలు, భారత పార్లమెంట్, భారతదేశ పటం, ఆంధ్రప్రదేశ్‌ మ్యాప్, పీపుల్స్‌ లీడర్‌ సీఎం వైఎస్‌ జగన్, ర్నూలు కొండారెడ్డి బురుజు, ప్రకాశం బ్యారేజ్ వంటి ఆకృతులతో డ్రోన్ల ప్రదర్శన అద్భుతంగా ఆకట్టుకుంది.

ప్రపంచంలోనే అద్భుతం.. ఇసుకేస్తే రాలనంత జనం నడుమ జాతికి అంకితం.. 

సాధారణ ప్రజల కోసం వాకింగ్ ట్రాక్‌లు..

హైదరాబాద్‌కు చెందిన కేపీసీ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ విగ్రహ నిర్మాణం చేపట్టింది. నోయిడాలోని డిజైన్‌ అసోసియేట్స్‌ డిజైన్లను తయారు చేసింది. డబ్బుకు ఏమాత్రం వెనుకాడకుండా ఏపీ ప్రభుత్వం ఈ నిర్మాణాన్ని చేపట్టింది. రూ.170కోట్లతో చేపట్టిన ప్రాజెక్టు పూర్తయ్యేసరికి రూ.404.35 కోట్లకు చేరింది. సాధారణ ప్రజలు ఉదయం, సాయంత్రం వాకింగ్ చేసేందుకు వీలుగా చుట్టూ వాకింగ్ ట్రాక్‌లను సైతం నిర్మించారు. స్వరాజ్ మైదానం ఇకపై పేరు కూడా మారనుంది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్వరాజ్ మైదాన్‌గా పిలవబడనుంది. విగ్రహం తయారీ కోసం 400 మెట్రిక్‌ టన్నుల స్టెయిన్‌లెస్ స్టీల్, 120 మెట్రిక్ టన్నుల కాంస్యాన్ని వినియోగించారు. మొత్తానికి ఈ విగ్రహ నిర్మాణంతో జగన్ చరిత్రలో నిలిచిపోనున్నారు. 

ప్రపంచంలోనే అద్భుతం.. ఇసుకేస్తే రాలనంత జనం నడుమ జాతికి అంకితం.. 
Google News