హాట్ టాపిక్ అవుతున్న కేశినేని భవన్.. కారణమేంటంటే..

హాట్ టాపిక్ అవుతున్న కేశినేని భవన్.. కారణమేంటంటే..

ఏపీ రాజకీయాల్లో ఎన్నికల సమయంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అసలు ఎన్నికల నాటికి ఏ నేత ఏ పార్టీలో ఉంటారో తెలియకుండా ఉంది. గత పదేళ్లుగా టీడీపీ ఎంపీగా ఉన్న కేశినేని నాని ఆ పార్టీతో పాటు తన లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేయనున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ తరువాత ఆయన టీడీపీతో పాటు ఆ పార్టీ నేతలున్న ఫ్లెక్సీలన్నింటినీ తన కార్యాలయం వద్ద తొలగించారు.

కేవలం తన ఫోటో, తన కూతురు శ్వేత ఫోటో ఉన్న ఫ్లెక్సీలను మాత్రమే ఉంచారు. తాజాగా కేశినేని భవన్ వద్ద ఒక ఆసక్తికర దృశ్యం కనిపిస్తోంది. ఆయన కార్యాలయం వద్ద సరికొత్త ఫ్లెక్సీలు, బ్యానర్‌లు ఆవిష్కృతమయ్యాయి. అవి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డితో కలిసి ఉన్న ఫ్లెక్సీలు, బ్యానర్‌లు కావడంతో అంతా వాటిని ఆసక్గిగా తిలకిస్తున్నారు. కేశినేని నానితో జగన్‌ను చూడటం నిజంగానే ఏపీ ప్రజానీకానికి కాస్త ఆసక్తికరంగానే అనిపిస్తోంది.

హాట్ టాపిక్ అవుతున్న కేశినేని భవన్.. కారణమేంటంటే..

టీడీపీని వీడుతున్నట్టు ప్రకటించిన తరువాత ఆ పార్టీ అధినేత చంద్రబాబుతో పాటు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను ఆయన తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు. అలాగే టీడీపీ నేతలను సైతం దూసించారు. ఆ తరువాత ముఖ్యమంత్రి జగన్‌తో ఆయన భేటీ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో విజయవాడ నుంచి వైసీపీ అభ్యర్థిగా లోక్‌సభ ఎన్నికల బరిలో నిలవనున్నట్టు సంకేతాలు ఇచ్చారు. తాజాగా జగన్‌తో ఉన్న ఫోటోలు కనిపించడంతో కేశినేని భవన్‌ వార్తల్లో నిలిచింది.

Google News