ఆ విషయంలో టీడీపీ జాగ్రత్త వహించాల్సిందే..

టీడీపీ సర్వేలన్నీ అబద్ధాలే.. ఇంకెన్ని రోజులిలా..!

టీడీపీ అధినేత చంద్రబాబుకు అనుకోని చిక్కులు ఎదురు కాబోతున్నాయా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఇప్పటికే వైసీపీ టికెట్ టెన్షన్‌ను ఎదుర్కొంటోంది. ఇక ఇప్పుడు టీడీపీ వంతు. నిజానికి టికెట్ పంపకం విషయంలో టీడీపీ చాలా జాగ్రత్తలు తీసుకోవల్సిన తరుణమిది. లేదంటే చిక్కుల్లో పడాల్సి వస్తుంది. వైసీపీ ఒంటరిగా పోటీ చేస్తూనే టికెట్ల పంపకం విషయంలో నానా తంటాలు పడుతోంది. అలాంటిది టీడీపీ జనసేనతో సీట్లు పంచుకోవాలి.

కాబట్టి టీడీపీ మరింత జాగ్రత్త వహించాల్సిన తరుణమిది. ఎందుకంటే టీడీపీ ఎప్పటి నుంచో నమ్ముకుని అండగా నిలిచిన సీనియర్ నేతలు ఉన్నారు. అలాగే గత ఎన్నికల్లో పార్టీ ఓటమి పాలైన వీడని నేతలూ ఉన్నారు. వారెవరికీ అన్యాయం జరగకుండా చూసుకోవాలి. అసలే జనసేనతో సీట్ల పంపకంతో కొన్ని స్థానాలను వదుకోవాల్సి వచ్చింది. ఒకవేళ బీజేపీ కూడా పొత్తులోకి వచ్చి చేరిందంటే ఆ పార్టీకి సైతం కొన్ని సీట్లను వదలాలి.

ఇక అది చాలదన్నట్టుగా.. ఇప్పుడు వైసీపీ నుంచి కొందరు నేతలు సైతం సైకిలెక్కేందుకు సిద్ధమవుతున్నారు. అక్కడ టికెట్ల పంపకంలో అన్యాయం జరిగిందని టీడీపీలో చేరేందుకు సిద్ధపడుతున్నారు. ఇక్కడ అన్యాయం జరిగినా అదే పరిస్థితి కదా. పోనీ వీరికి సీట్లు కేటాయించి టీడీపీ నేతలకు అన్యాయం చేస్తే అసమ్మతి రగులుతుంది. అది రగలకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా టీడీపీ అధిష్టానానిదే. టికెట్ల పంపకం విషయంలో జాగ్రత్త వహిస్తే ఇక టీడీపీకి ఎలాంటి ఇబ్బందీ లేనట్టే.

Google News