మహిళా జర్నలిస్ట్‌పై టీడీపీ, జనసేన కార్యకర్తల ట్రోలింగ్..

మహిళా జర్నలిస్ట్‌పై టీడీపీ, జనసేన కార్యకర్తల ట్రోలింగ్..

ఎన్నికలు దగ్గరపడుతుంటడంతో టీడీపీ, జనసేనలు మరింత యాక్టివ్ అయ్యాయి. వాటి అనుకూల సోషల్ మీడియాను వినియోగించుకుని రెచ్చిపోతోంది. చివరకు ఈ రెండు పార్టీలు తమ సోషల్ మీడియా కార్యకర్తలను వినియోగించుకుని ఒక మహిళ జర్నలిస్ట్‌ను సైతం తూలనాడింది. ఆమె వ్యక్తిత్వ హననానికి సైతం పాల్పడే స్థాయికి దిగజారింది. టీవీ9 మహిళ జర్నలిస్ట్ హసీనాపై ఈ రెండు పార్టీల సోషల్ మీడియా ట్రోలింగే దీనికి ప్రత్యక్ష ఉదాహరణ. సంక్రాంతి పండుగ అంటేనే మీడియా ఛానళ్లన్నీ ప్రత్యేక కార్యక్రమాలకు తెరదీస్తుంటాయి. ఈ క్రమంలోనే టీవీ 9తో ప్రత్యేక కార్యక్రమం చేసింది. తన విధి నిర్వహణలో భాగంగా సీనియర్ కరస్పాండెంట్ హసీనా ఎమ్మెల్యే కొడాలి నాని బైక్‌పై కొద్ది దూరం ప్రయాణించింది.

ఇదేది దారుణాతి దారుణమైన నేరమంటూ హసీనాపై విపరీతమైన దుష్ప్రచారానికి తెరదీశారు. సోషల్ మీడియాను వేదికగా చేసుకుని అసభ్యకరమైన పోస్టులు పెట్టి పైశాచిక ఆనందం పొందారు. ఒక రాజకీయ నాయకుడు లేదంటే ఓ వ్యక్తి బైక్‌పై ఎక్కడం అతి పెద్ద నేరమన్నట్టుగా నీచమైన కామెంట్స్ చేసింది. మీడియాలో ఇలాంటి కార్యక్రమాలు మీడియాలో కొత్తేమీ కాదు. జర్నలిస్ట్ అంటే సిట్యువేషన్.. వ్యక్తులు.. సెలబ్రిటీలు అనేది చూడకుండా సందర్భాన్ని బట్టి పని చేస్తూ పోవాల్సిందే.. అంత మాత్రాన ఇలా నీచమైన ట్రోలింగ్‌కు దిగడమే ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

ఒక జర్నలిస్ట్ అనడం కన్నా ఆమె ఒక మహిళ.. ఆ సంగతి మరిచి వ్యక్తిత్వ హననానికి పాల్పడటంపై జనాలు సైతం మండిపడుతున్నారు. కార్యక్రమంలో భాగంగా బండెక్కడాన్ని కూడా వక్రీకరించి ఆమెను మోరల్‌గా దెబ్బ తీసే యత్నమైతే టీడీపీ, జనసేనల సోషల్ మీడియా చేసింది. జర్నలిజంలో మహిళల సంఖ్య చాలా తక్కువ. ఉన్న మహిళలపై కూడా ఇలాంటి అసభ్యకరమైన, దుష్ప్రచారం చేయడం ఎంత వరకు సమంజసం? ఒకవేళ హసీనా స్థానంలో సోషల్ మీడియాలో చేసిన వారి చెల్లో.. బంధువులో ఉంటే కూడా ఇలాగే దారుణంగా ట్రోలింగ్ చేస్తారా? మహిళలను ట్రోల్ చేసేటప్పుడు ఒక్కసారి ఆలోచించండి అంటున్నారు జనాలు.

Google News