Sarath Chandra Reddy: ఢిల్లీ లిక్కర్ కేసులో సంచలనం.. అప్రూవర్‌గా మారిన శరత్ చంద్రారెడ్డి

Sarath Chandra Reddy: ఢిల్లీ లిక్కర్ కేసులో సంచలనం.. అప్రూవర్‌గా మారిన శరత్ చంద్రారెడ్డి

ఢిల్లీ మద్యం కుంభకోణంలో నిందితుడు, అరబిందో ఫార్మా డైరెక్టర్‌ శరత్‌ చంద్రా రెడ్డి(Sarath Chandra Reddy) ఆప్రూవర్‌గా మారారు. తాను అప్రూవర్‌గా మారేందుకు అనుమతించాలని కోరుతూ రౌస్ అవెన్యూ సీబీఐ కోర్టులో అభ్యర్థన దాఖలు చేశారు. దీనికి సీబీఐ కోర్టు(CBI Court) సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో గత ఏడాది నవంబర్‌లో శరత్ చంద్రారెడ్డి అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం ఆయన బెయిల్‌పై ఉన్నారు. ఇప్పటికే కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబు అప్రూవర్‌గా మారారు. ఇక నేడు శరత్ చంద్రారెడ్డిSarath Chandra Reddy) సైతం అప్రూవర్‌గా మారడంతో సీఎం కేసీఆర్‌ కూతురు, ఎమ్మెల్సీ కవిత పేరు ఢిల్లీ మద్యం స్కాంలో మరోసారి తెరపైకి రానుందని తెలుస్తోంది.

ప్రస్తుతం శరత్ చంద్రారెడ్డిSarath Chandra Reddy) అప్రూవర్‌గా మారారు కాబట్టి తాను కవిత ప్రేరణతోనే మద్యం వ్యాపారంలో పాల్గొన్నానని చెప్పే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత ప్రమేయం ఉన్నదని.. అయినా కూడా ఆమెపై కేంద్రం చర్యలు కావాలనే తీసుకోవడం లేదంటూ పెద్ద ఎత్తున విపక్షాలు ఆరోపిస్తున్నాయి. రాష్ట్ర బీజేపీ నేతలు సైతం ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. బీఆర్ఎస్‌ను దెబ్బతీయాలంటే.. కేసీఆర్‌(KCR) కుటుంబాన్ని కేసుల వలయంలో ఇరికిస్తే తప్ప సాధ్యం కాదని బీజేపీ నేతలు చెబుతున్నారు. అలాగే.. ఢిల్లీలో బీజేపీ, బీఆర్‌ఎస్‌ మధ్య ఏదో అవగాహన ఉందనే ప్రచారం జరుగుతోంది.

Google News