Avinash Reddy: అవినాశ్ విచారణ నేపథ్యంలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్న సీబీఐ అధికారులు

Avinash Reddy: అవినాశ్ విచారణ నేపథ్యంలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్న సీబీఐ అధికారులు

వైఎస్ వివేకా హత్య కేసులో నేడు ఎంపీ అవినాశ్ రెడ్డి(Avinash Reddy)ని సీబీఐ నేడు విచారణ జరుపుతోంది. నేటి ఉదయం 10 గంటలకు అవినాశ్ తన నివాసం నుంచి బయలుదేరి సీబీఐ కార్యాలయానికి చేరుకున్నారు. ఇప్పటికే అవినాశ్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన ముందుస్తు బెయిల్ మంజూరు చేసింది. ఆ సమయంలో ప్రతి శనివారం ఉదయం 10.30 నుంచి సాయంత్రం 4.30 వరకూ ఆయనను విచారించాలని తెలంగాణ హైకోర్టు(Telangana High Court) ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు నేడు అవినాశ్ సీబీఐ ఎదుట విచారణకు హాజరయ్యారు.

కాగా.. సీబీఐ అధికారులు అవినాశ్ విచారణ నేపథ్యంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. వాట్సప్ కాల్స్, నిందితులతో పరిచయాలపై సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. అడిషనల్ ఎస్పీ స్థాయికి చెందిన అధికారి సమక్షంలో విచారణ కొనసాగుతోంది. విచారణ మొత్తాన్ని సీబీఐ అధికారులు ఆడియో, వీడియోలు చిత్రీకరిస్తున్నారు. వివేకా హత్యకు వాడిన గొడ్డలిపై సైతం అవినాశ్‌ను ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. సునీల్ యాదవ్ గొడ్డలి దాచిన విషయంపై సీబీఐ ఆరా తీస్తోంది. వివేకా మరణంపై సీఎం జగన్‌కి ముందుగా ఎవరు చెప్పారని సీబీఐ ప్రశ్నిస్తోంది. తనకు , ఈ హత్యకు ఎలాంటి సంబంధమూ లేదని అవినాశ్ చెబుతున్నారు. సీబీఐ అధికారులు అవినాశ్ స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేస్తున్నారు.

Advertisement