ఏపీలో పార్టీపై వ్యతిరేకతను తొలగించేందకు వైసీపీ యత్నం.. వారే టార్గెట్‌గా జగన్ సరికొత్త వ్యూహం..!

ఏపీలో పార్టీపై వ్యతిరేకతను తొలగించేందకు వైసీపీ యత్నం.. వారే టార్గెట్‌గా జగన్ సరికొత్త వ్యూహం..!

ఏపీ(Andhra Pradesh)లో ఎన్నికల వాతావరణం కొద్ది రోజుల క్రితమే ప్రారంభమైంది. ఇప్పటికే ఎన్నికల ప్రచారం రేసులో అధికార పార్టీ వైసీపీ కంటే ప్రతిపక్ష పార్టీ టీడీపీ(TDP) ముందుంది. ఎలాగైనా ఎన్నికల్లో విజయం సాధించాలనే లక్ష్యంతో ఈ పార్టీ అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే ప్రధాన పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.

ఇక ఇప్పుడు పార్టీల పొత్తు వ్యవహారం సైతం తెలంగాణలో హాట్ టాపిక్‌గా మారిందని చెప్పాలి. టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh), జనసేన అధినేత పవన్ కల్యాణ్‌(Pawan Kalyan)లు నిత్యం జనంలోనే ఉంటున్నారు. యువగళం సాక్షిగా నారా లోకేష్ యువతను ఆకర్షిస్తున్నారు.

అయితే ఈసారి తమ పార్టీకి ఎన్ని అడ్డంకులొచ్చినా కూడా సంక్షేమ పథకాలు గట్టెక్కిస్తాయని వైసీపీ(YSRCP) ధీమాగా ఉంది. కానీ ఈ పార్టీకి ఉద్యోగులు, విద్యార్థులు, మహిళలు, యువత అంతా వ్యతిరేకంగా ఉన్నారు. ఒకరకంగా చెప్పాలంటే.. టీడీపీ(TDP)కి కలిసొస్తున్న అంశం కూడా ఇదే. ఇక ఇప్పుడు టీడీపీ మెయిన్‌గా యూత్, మహిళలను టార్గెట్ చేసింది.

అయితే వైసీపీ కూడా చాలా త్వరగానే మేల్కొందని సమాచారం. ఈ క్రమంలోనే ప్రభుత్వ వ్యతిరేకతను తిప్పికొట్టేందుకు వైసీపీ యత్నిస్తోంది. ఎలాగైనా పార్టీపై ఉన్న వ్యతిరేకతను తొలగించేందుకు యత్నిస్తోంది. ఈ క్రమంలోనే యువత, మహిళల కోసం ప్రత్యేకంగా సీఎం జగన్(CM Jagan) కీలక నిర్ణయం తీసుకోబోతున్నారని టాక్.

Google News