పోలవరం… జగన్ దక్షతకు నిదర్శనం

పోలవరం… జగన్ దక్షతకు నిదర్శనం

ప్రతి అవకాశంలోనూ తన వక్తిగత ప్రయోజనం వెతుక్కునేవాడు రాజకీయనాయకుడు .. ప్రతి అవకాశాన్ని సమాజ హితం కోసం వినియోగించేవారు ప్రజాసేవకుడు. పోలవరం అంశం కూడా అంతే … చంద్రబాబు ఆ ప్రాజెక్టును తనకు,, తన అనుయానులకు ప్రయోజనకరంగా ఉండేలా వాడుకున్నారు. జగన్ వచ్చాక దాని తీరుతెన్నులు మారాయి. కేంద్రం సైతం జగన్ వాదనతో ఏకీభవించి అదనంగా నిధులు ఇవ్వడానికి ఒప్పుకున్నది.

  • బృహత్తరమైన ఈ ప్రాజెక్ట్ ఏళ్ల తరబడి కొనసాగుతుంది తప్ప తుది రూపు దాల్చ లేదు.
  • మహానేత అనంతరం పాలకుల నిర్లక్ష్యం.. అంచనా వ్యయం పెంచేసి దోపిడీ కారణంగా ప్రాజెక్ట్ ఫలాలు ప్రజలకు అందించలేదు.
పోలవరం… జగన్ దక్షతకు నిదర్శనం

తెలుగు ప్రజల ఆశలతో దోబుచులాడుకున్న చంద్రబాబు నయా గ్యాంగ్

  • పోలవరం ప్రాజెక్ట్ పూర్తయితే ఆంధ్ర రాష్ట్రంలో 27 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరు
  • ఉభయ గోదావరి జిల్లాలో 10 లక్షలు, కృష్ణ జిల్లాలో మరో 13 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ
  • పోలవరం నుంచి విశాఖపట్నం వరకు 182 కి. మీ ఎడమ కాలువ ద్వారా 4 లక్షల ఎకరాలకు సాగు నీరు
  • 172 కి.మీ పొడవున్న కుడి కాలువ ద్వారా విజయవాడ వరకు మరో 3.20 లక్షల ఎకరాలకు అదనంగా సాగు నీరు సరఫరా చేయవచ్చు
  • పోలవరం రిజర్వాయర్ లో భారీగా నీటిని నిల్వ చేసే అవకాశం ఉంది
  • ఈ ప్రాజెక్ట్ ద్వారా 960 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు ప్రణాళికలు రూపొందించారు
  • మెట్ట ప్రాంతంలో 540 గ్రామాలకు తాగు నీరు అందించేందుకు వీలు ఉంది
పోలవరం… జగన్ దక్షతకు నిదర్శనం

బాబు జగజ్జీవన్ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా 3 జిల్లాలకు 3 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించవొచ్చు

  • ఇంతటి ప్రాధాన్యత ఉన్న ఈ ప్రాజెక్టుకు సమీపంలో చంద్రబాబు పట్టిసీమ ఎత్తి పోతల పథకానికి చంద్రబాబు రూపకల్పన చేసి తూట్లు పొడిచాడు
  • బృహత్తరమైన పోలవరాన్ని వదిలేసి కాంట్రాక్టర్లకు లబ్ది చేకూరేలా పట్టి సీమను పూర్తి చేయడానికి బాబు ఆసక్తి చూపించారు
  • పోలవరాన్ని పూర్తి చేద్దాం అనే ఆలోచన చంద్రబాబుకు లేదు.. అందుకే నాడు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యం ఐన చంద్రబాబు నిమ్మకు నీరెత్తినట్లు నటించాడు
  • ప్రణాళిక బద్దంగా నిధులు కేటాయింపు చేయలేదు.. వాటి కోసం ఎటువంటి ప్రయత్నం కూడా బాబు చేయలేదు (కారణం ఓటుకు నోటు కేసు వలన)
  • పోలవరం పూర్తి చేయాలనే దృఢ సంకల్పం చంద్రబాబుకు లేదు
  • పట్టిసీమ పై పెట్టిన డబ్బులు పోలవరం పై పెట్టి ఉంటే.. పోలవరం సాగ భాగం పూర్తి అయ్యేది
  • పట్టిసీమ మూలంగా 70 టీఎంసీ ల నీరు కృష్ణ జిల్లాకు వెళ్తుంది.. అదే పోలవరం పూర్తి అయితే 80 టీఎంసీల నీరు వెళ్తుంది.
  • పట్టిసీమ పేరుతో ప్రజా ధనం దోపిడీ చేసింది చంద్రబాబు ప్రభుత్వం.
పోలవరం… జగన్ దక్షతకు నిదర్శనం

జగన్ దక్షతకు పోలవరం ఓ నిర్వచనం

  • టిడిపి శాపం నుండి విముక్తి కలిగించిన సీఎం వైఎస్ జగన్
  • 2013-14 ధరల ప్రకారం ఐతే రావాల్సింది రూ. 1249 కోట్లే
  • సీఎం జగన్ సమర్థతతో కేంద్రం నుంచి 12,911 కోట్లు సాధించిన వైనం
  • మరో రూ. 10000 కోట్లు అడిగిన సీఎం వైయస్ జగన్.. సానుకూలంగా స్పందించిన ప్రధాని
  • ఇక పోలవరం పనుల్లో గణనీయమైన పురోగతి.
Google News