చంద్రబాబుకు బెయిల్ మాత్రమే వచ్చింది కానీ..!!

చంద్రబాబుకు బెయిల్ మాత్రమే వచ్చింది కానీ..!!

అవును.. స్కిల్ స్కాములో దాదాపు రూ. 374 కోట్లను దోచుకుని, పైబర్ నెట్.. ఇన్నర్ రింగ్ రోడ్.. లిక్కర్ స్కాంలో కీలక సూత్రధారిగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టు బెయిల్ ఇచ్చింది. చంద్రబాబు ఆరోగ్య కారణాల రీత్యా న్యాయస్థానం మధ్యంతర బెయిల్ ఇచ్చింది. తిరిగి నవంబర్ 28న సరెండర్ అవ్వాలని కోర్టు ఆదేశించింది. కాగా.. అరెస్ట్ అయినా నెలన్నర రోజులుగా రాజమండ్రి జైల్లో ఉన్న చంద్రబాబు ఆనాటి నుంచీ అనారోగ్యం పేరిట ఎల్లో మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తూ వస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. డీహైడ్రేషన్, చర్మ సమస్యలు, కంటి సమస్య ఉందని, బీపీ, దీర్ఘకాలిక అనారోగ్యాలు ఉన్నాయని బెయిల్ కోసం ఇలా పలు అంశాలను విస్తృతంగా ఎల్లో మీడియా ప్రచారం చేస్తూ ప్రజల్లో సానుభూతి కోసం ప్రయత్నిస్తూ వస్తోంది.

చంద్రబాబు విషయంలో సీఎం వైయస్ జగన్ ప్రభుత్వం అన్ని జాగ్రత్తలూ తీసుకోవడమే కాకుండా ఎన్నడూ లేనిది ఆయనకు ఎయిర్ కండిషనర్ కూడా ఏర్పాటు చేసింది. అయినా సరే బెయిల్ కోసం ఆయనకు లేని రోగాలను సైతం ఉన్నట్లు చూపించి ఎల్లోమీడియాలో అడ్డగోలుగా ప్రచారం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు షరతులతో కూడిన నాలుగు వారాల మధ్యంతర బెయిల్ కోర్టు మంజూరు చేసింది. రూ.లక్ష పూచీకత్తు, 2 షూరిటీలు సమర్పించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Advertisement

హైకోర్టు విధించిన షరతులు ఇవే..

  1. ఎటువంటి రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనకూడదు
  2. కేసుకు సంబంధించిన సాక్షులను ప్రభావితం చేయకూడదు
  3. ఆరోగ్య కారణాలతో మంజూరు చేసిన బెయిల్ కాబట్టి, ఇల్లు, ఆసుపత్రికి మాత్రమే పరిమితం కావాల్సి ఉంటుంది
  4. చంద్రబాబుతో ఇద్దరు DSPలు ఎస్కార్ట్ ఉంచాలన్న ప్రభుత్వ అభ్యర్ధనపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలన్న న్యాయమూర్తి
  5. Z+ సెక్యూరిటీ విషయంలో… కేంద్ర నిబంధనలమేరకు అమలు చేయాలని, CBN సెక్యూరిటీ అంశంలో కోర్టు జోక్యం ఉండదని వ్యాఖ్య
  6. నవంబర్‌ 10న చంద్రబాబు రెగ్యులర్‌ బెయిల్‌పై విచారణ జరుపుతామన్న కోర్టు.