జన ప్రభంజనం.. జగనన్నదే విజయం!

జన ప్రభంజనం.. జగనన్నదే విజయం!

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ముందు వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో ఎటు చూసినా జనం.. ఇసుకేస్తే రాలనంత మంది ప్రజానీకం..!. ఒక జిల్లాకు మించి మరో జిల్లాలో జనం..! జగన్ చేస్తున్నది ఎన్నికల ముందు యాత్ర కాదు.. గెలిచిన తర్వాత జరుగుతున్న యాత్రగా అనిపిస్తోంది. వాస్తవానికి కృష్ణా, గుంటూరు జిల్లాలు అంతో ఇంతో టీడీపీకి వైసీపీతో సమానమైన బలముంది. అలాంటి చోటే రాయలసీమను మించిపోయేలా జగన్ సభకు జనం తరలి వస్తుండటంతో ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. జగన్ అడుగు పెట్టిన దగ్గర నుంచి జనం ప్రభంజనంలా పెరుగుతూ వెళుతోంది. పైగా టీడీపీ, జనసేనల నుంచి స్టార్ క్యాంపెయినర్స్ అయిన చంద్రబాబు, పవన్ కల్యాణ్, బాలకృష్ణ వంటి వారికి కూడా ఇంతటి జన బలం కనిపించడం లేదు. ఈ ఇద్దరూ ఎక్కడికెళ్లినా జనాలు అంతంత మాత్రమే వస్తుండటంతో సభలు అట్టర్ ప్లాప్ అవుతున్నాయి.

జన ప్రభంజనం.. జగనన్నదే విజయం!

అటు ప్లాప్.. ఇటు సూపర్ హిట్టు!

రాళ్ల దాడి ఘటన, ఒక్కరోజు విరామం తర్వాత సోమవారం నాడు జగన్ బస్సు యాత్రలో గన్నవరం నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి ఆత్కూర్, వీరవల్లి క్రాస్, హనుమాన్‌ జంక్షన్, పుట్టగుంట మీదుగా జొన్నపాడు వద్దకు చేరుకుని భోజన విరామం తీసుకున్నారు. అనంతరం తన యాత్రను తిరిగి జగన్ కొనసాగించారు. జొన్నపాడు, జనార్దనపురం మీదుగా సాయంత్రం 3.30 గంటలకు గుడివాడ చేరుకున్నారు. ఎక్కడా కూడా జగన్‌కు జన ప్రాబల్యం తగ్గలేదు. అడుగడుగునా నీరాజనం పట్టారు. జనసంద్రాన్ని చూసిన మీదట వైసీపీ నేతల్లో ఎక్కడ లేని ఉత్సాహం వస్తోంది. ఇక అసలు సిసలైన గుడివాడలో అయితే.. భారీ బహిరంగ సభకు తక్కువలో తక్కువ లక్షలాది మంది తరలి వచ్చేశారు. జై జగన్ నినాదాలతో ఆ ప్రాంతమంతా హోరెత్తింది. ఈ జనాన్ని అంతా చూశాక.. రాష్ట్రంలో విజయం ఎవరిదనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక్కడే మనకి విజయం ఎవరిదో మనకు కళ్లకు కట్టినట్టుగా కనపడుతోంది.

జన ప్రభంజనం.. జగనన్నదే విజయం!

ఎవరూ ఆపలేరు!

దాడి ఘటన తర్వాత తొలి సభ కావడం.. పైగా కొడాలి నాని అడ్డా అయిన గుడివాడలో సభ అనేసరికి ఒక్కటే జనం. అడుగు తీసి అడుగుపెట్టలేనంతగా వచ్చేశారు. ఇక ఇదే సభావేదికగా.. రాళ్ల దాడిపై స్పందించారు. ‘అర్జునుడిపై ఒక బాణం వేసినంతమాత్రాన కురుక్షేత్రంలో కౌరవులు నెగ్గినట్టు కాదు.. జగన్‌పై ఒక రాయి వేసినంత మాత్రాన.. మన పేదల ప్రభుత్వం గెలుపును ఎవరూ ఆపలేరు.. ఇలాంటి దాడులతో నా సంకల్పం చెక్కు చెదరదు.. ఈస్థాయికి వారు దిగజారారు అంటే మనం విజయానికి అంత చేరువగా ఉన్నామని అర్థం. ప్రజలకు మంచి చేసే ఉద్దేశంతో ఉన్న మీ జగనన్నను దేవుడే కాపాడి.. ఇంకా పెద్ద స్క్రిప్ట్ రాశారు’ అని ప్రత్యర్థులపై జగన్ సున్నితంగానే మాట్లాడారు. వాస్తవానికి ఈ ఘటనపై జగన్ ఓ రేంజిలో ప్రతిపక్షాలపై విరుచుకుపడుతారని వైసీపీ శ్రేణులు భావించినప్పటికీ.. అన్నీ పైనున్న దేవుడే చూసుకుంటారనే డైలాగ్‌తో జగన్ మిన్నకుండిపోయారు. చూశారా ఇంత జరిగినప్పటికీ జగన్ ఎంత ఓపిక, సహనంతో ప్రత్యర్థుల గురించి మాట్లాడుతున్నారని వైసీపీ కార్యకర్తలే ఆశ్చర్యపోతున్నారు.

జన ప్రభంజనం.. జగనన్నదే విజయం!
Google News