ఇక సోషల్ మీడియాలో పచ్చ ‘ఫెకు’డు

సైకో మాదిరిగా మారిన సైకిల్ పార్టీ.. ఛీ.. ఇంత నీచమా?

ఏదైనా మనం అనుకున్నది క్షణాల్లో పబ్లిక్‌ను చేరాలంటే దానికి మీడియానో.. సోషల్ మీడియానో అవసరం అవుతుంది. ఇంతకు ముందు మాదిరిగా మీడియా ఒక్కటే కాకుండా సోషల్ మీడియా చాలా యాక్టివ్‌ అయింది. మంచా చెడా చూసుకోకుండా ఇవి తాము అనుకున్న సమాచారాన్ని క్షణాల్లోనే వైరల్ చేసేస్తూ ఉంటాయి. ఇప్పుడు టీడీపీ మెయిన్ స్ట్రీమ్ మీడియానే కాకుండా సోషల్ మీడియాను సైతం ఎడా పెడా వాడేస్తోంది. ఒక్క మీడియానే కూడా సోషల్ మీడియానుసైతం మేనేజ్ చేయడానికి రంగం సిద్ధం చేసింది. 

ఒకటి కాదు.. రెండు కాదు..

Advertisement

టీడీపీ తరుఫున.. టీడీపీ అనుకున్న దాన్ని ప్రచారం చేసేందుకు మీడియాలో అయితే ఏబీఎన్, ఈటీవీ, టీవీ 5, మహాన్యూస్ వంటి పచ్చ సంస్థలు ఆ పార్టీకి ఎలాగూ ఉండనే ఉన్నాయి. ఇక మేనేజ్ చేయవలసినది.. కేవలం సోషల్ మీడియానే. దానిలో సైతం తప్పుడు ప్రచారాలు చేయడానికి టీడీపీ సిద్ధమైపోయింది. దీని కోసం ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా లక్షన్నర వాట్సాప్ గ్రూప్‌లను క్రియేట్ చేసింది. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రాం, ట్విటర్, యూట్యూబ్ వంటి 500 సోషల్ మీడియా పేజీలను సిద్ధం చేసింది.

సైకో మాదిరిగా మారిన సైకిల్ పార్టీ.. ఛీ.. ఇంత నీచమా?

వైసీపీపై తప్పుడు ప్రచారమే లక్ష్యం..

ఇక 2.5 లక్షల మందితో మన టీడీపీ అప్లికేషన్‌ను తయారు చేసింది. ఇవి కేవలం తప్పుడు ప్రచారాలు, జగన్ మీద మార్ఫింగ్ పిక్స్, మీమ్స్, తప్పుడు సర్వేలు.. టీడీపీ అనుకూలంగా ఉండే వార్తలు మాత్రమే ప్రచారం చేయనున్నారు. మొత్తానికి టీడీపీ అయితే గట్టి స్కెచ్‌తోనే రంగంలోకి దిగింది. టార్గెట్ వైసీపీని స్టార్ట్ చేసింది. ఎలాగైనా వైసీపీని ఇరికించడమే లక్ష్యం. ఏదో ఒక రకంగా వైసీపీపై తప్పుడు ప్రచారం చేయాలనేదే ఎజెండా. మొత్తానికి సైకిల్ పార్టీ సైకో మాదిరిగా మారింది. ప్రజలంతా ఇటువంటి వాటిని గమనించాలి. ఇలాంటి ఎత్తులకు తలొగ్గకుండా అప్రమత్తంగా ఉండాలి.