ఈసారి కూడా అధికారం వైసీపీదే: తేల్చిన టైమ్స్ నౌ

ఈసారి కూడా అధికారం వైసీపీదే: తేల్చిన టైమ్స్ నౌ

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మీడియా సంస్థలు, సర్వే సంస్థలు పెద్ద ఎత్తున ఒపీనియన్ పోల్స్ నిర్వహిస్తన్నాయి. ఇప్పటికే ఎన్నో సంస్థలు తమ సర్వేలను వెలువరించాయి. తాజాగా నేషనల్ మీడియా సంస్థ అయిన టైమ్స్ నౌ తను నిర్వహించిన సర్వే ఫలితాలను వెలువరించింది. ఈ క్రమంలోనే ఏపీ, తెలంగాణ లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో కూడా వివరించింది. ఏపీలో అత్యధిక లోక్‌సభ స్థానాలను వైసీపీ కైవసం చేసుకోవడం ఫిక్స్ అని టైమ్స్ నౌ తెలిపింది. పెద్ద ఎత్తున స్థానాలను ఆ పార్టీకి రాబోతున్నాయని తెలిపింది. 

తెలంగాణలో సార్వత్రిక ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీకి తిరుగుండదని సర్వే సంస్థ వెల్లడించింది. తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలకు గానూ.. కాంగ్రెస్‌కు 8-10 ఎంపీ స్థానాలు వచ్చే అవకాశముందని సర్వే సంస్థ తేల్చింది. బీజేపీ రెండో స్థానంలో ఉండబోతోందట. తెలంగాణలో బీజేపీకి 4-6 ఎంపీ స్థానాలు, బీఆర్ఎస్ పార్టీకి 1-3 ఎంపీ స్థానాలకు పరిమితమవుతుందని టైమ్స్ నౌ వెల్లడించింది. ఇక ఏపీ విషయానికి వస్తే ఈసారి పక్కాగా వైసీపీదే హవా అని తేల్చింది. ఏపీ సీఎం వైఎస్ జగన్ నాయకత్వంలోని వైసీపీ లోక్‌సభ ఎన్నికల్లో 21-22 సీట్లు వస్తాయని టైమ్స్ నౌ వెల్లడించింది.

ఈసారి కూడా అధికారం వైసీపీదే: తేల్చిన టైమ్స్ నౌ

ఇక, టీడీపీ-జనసేన-బీజేపీ కూటమికి 3-4 ఎంపీ స్థానాలు వచ్చే అవకాశం ఉందని తెలిపింది. దీంతో వైసీపీ విజయం ఏపీలో మరోసారి ఫిక్స్ అని తెలుస్తోంది.  మొత్తానికి ఏపీలో అయితే సర్వేలన్నీ మూకుమ్మడిగా వైసీపీకే అధికారాన్ని కట్టబెడుతున్నాయి. సర్వే ఫలితాలతో వైసీపీ మంచి జోష్ మీదుంది. వైసీపీ అధినేత జగన్‌కు వస్తున్న ప్రజాదరణ చూస్తున్నా కూడా సర్వేలతో పని లేకుండా వైసీపీదే విజయమని అర్థమవుతుంది. ఆయన నిర్వహిస్తున్న బస్సు యాత్రలకు ఇసుకేస్తే రాలనంతగా జనం వస్తున్నారు.

Google News