సర్వే ఏదైనా ఫలితం ఒక్కటే.. ఏపీ పక్కా వైసీపీదే..!

సర్వే ఏదైనా ఫలితం ఒక్కటే.. ఏపీ పక్కా వైసీపీదే..!

ఎన్డీ టీవీ కూడా అదే చెప్పింది.. ఏపీలో నిర్వహించిన అన్నీ వెలువరించిన ఫలితాలనే నేషనల్ మీడియా ఎన్డీ టీవీ సైతం ప్రకటించింది. ఇప్పటి వరకూ దాదాపు సర్వేలన్నీ ఏపీలో ఒక్కటే పార్టీకి పట్టం కడుతున్నాయి. అది మరేదో కాదు.. అధికార పార్టీయే. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో స్థానిక సంస్థలతో పాటు నేషనల్ మీడియా మొత్తం సర్వేలు చేపడుతోంది. ఇప్పటికే లోకల్‌తో పాటు కొన్ని నేషనల్ మీడియా సంస్థలు తమ సర్వే ఫలితాలను వెలువరించాయి. 

అన్నింటి ఫలితం కామన్‌గానే ఉంటోంది. రానున్న ఎన్నికల్లో వైసీపీదే విజయమని తేల్చి చెబుతున్నాయి. నిన్న టైమ్స్ నౌ చెప్పిన మాదిరిగానే నేడు ఎన్డీ టీవీ కూడా చెప్పింది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో వైసీపీ 16 స్థానాల్లో విజయ ఢంకా మోగించనుందని తెలిపింది. ఇక టీడీపీ – జనసేన – బీజేపీ కూటమి 9 స్థానాలతో సరిపెట్టుకుంటుందని వెల్లడించింది. 2024లో ఏపీలో పక్కాగా విజయం వైసీపీదేనని ఎన్డీ టీవీ సర్వే తేల్చింది. దీంతో జూన్ లో ప్రమాణస్వీకారం ఎక్కడ జరపాలి అనే చర్చల్లో వైసీపీ శ్రేణులున్నాయి.

సర్వే ఏదైనా ఫలితం ఒక్కటే.. ఏపీ పక్కా వైసీపీదే..!

టైమ్స్ నౌ వెలువరించిన సర్వేకి.. ఎన్డీ టీవీ వెలువరించిన సర్వేకి కొంత తేడా అయితే ఉంది. టైమ్స్ నౌ వచ్చేసి వైసీపీ 20కి పైన స్థానాలను సాధిస్తుందని చెప్పింది. అలాగే టీడీపీ – జనసేన – బీజేపీ కూటమి 3 – 4 స్థానాలను మాత్రమే కైవసం చేసుకుంటుందని వెల్లడించింది. అయితే ఎన్డీ టీవీ సర్వేలో అయితే వైసీపీకి కొన్ని స్థానాలు తగ్గి కూటమికి పెరిగాయి. సీట్ల విషయంలో కొంత తేడా ఉన్నా కూడా వైసీపీదే విజయమని సంస్థలన్నీ చెబుతున్నాయి.

Google News