జగనన్న ఆరోగ్య సురక్ష.. ఊరూరా మెడికల్ క్యాంపులు.. ఇంటింటికి వైద్య సేవలు..

జగనన్న ఆరోగ్య సురక్ష.. ఊరూరా మెడికల్ క్యాంపులు.. ఇంటింటికి వైద్య సేవలు..

ఏపీ సీఎం పీఠాన్ని అధిరోహించిన తర్వాత చాలా రంగాల్లో మార్పులు తీసుకొచ్చారు. వాటిలో ఒకటి వైద్యం. నిజానికి సామాన్యుడికి అత్యవసరమైన వాటిలో వైద్యం కూడా ఒకటి. చాలా మంది నిరుపేదలు వైద్యం చేయించుకునేందుకు డబ్బు లేక ప్రాణాలొదిలిన ఘటనలు కోకొల్లలు కానీ జగన్ సీఎం అయ్యాక అలాంటి ఘటనలే లేవు. ఏపీలో ఇన్నాళ్లూ ఒకెత్తు.,.. ఇప్పుడు ఇంకో ఎత్తు.. రాష్ట్రంలో ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలన్నది సీఎం వైయస్ జగన్ సంకల్పం. మరి అలా ఉండాలంటే ఎలా ? ప్రజలందరికీ వైద్య సేవలు అందితేనే కదా అది సాధ్యమవుతుంది.

జగనన్న ఆరోగ్య సురక్ష.. ఊరూరా మెడికల్ క్యాంపులు.. ఇంటింటికి వైద్య సేవలు..

గుమ్మం ముందే వైద్యం..

పేదలు .. వృద్ధులు.. వికలాంగులు .. ఇల్లు కదల్లేనివాళ్ళు.. మరి వీళ్ళందరికీ ఎలా… ఎవరు వైద్యం చేస్తారు? ఎవరూ తోడులేనివారికి దేవుడే దిక్కు అంటారు. ఇప్పడు అలాంటి వారిపట్ల సీఎం వైఎస్ జగన్ దేవుడయ్యారు. సీఎం జగన్ తన ప్రతినిధులుగా వైద్య సిబ్బందిని ఇంటింటికీ పంపించి.. ఎవరెవరికి ఏయే ఆరోగ్య సమస్యలున్నాయో తెలుసుకుంటున్నారు. వారికి వెంటనే పరీక్షలు చేసి, అక్కడికక్కడే మందులు ఇచ్చి, అవసరమైతే పెద్ద ఆసుపత్రికి పంపే ఏర్పాట్లు సైతం చేస్తున్నారు. దీంతో ఇంటింటికి డాక్టర్లు, నర్సులు, వైద్య సిబ్బంది రాకతో ప్రజలకు తమ గుమ్మం ముందే వైద్యం అందుతోంది. సెప్టెంబర్ 30న మొదలైన ఈ బృహత్తర కార్యక్రమం ఇన్ని రోజులుగా కోట్లాదిమందికి సేవలు అందిస్తూ విజయవంతంగా ముందుకు సాగుతోంది. ప్రతి ఇంటా ఆరోగ్యాన్ని పంచుతోంది.

జగనన్న ఆరోగ్య సురక్ష.. ఊరూరా మెడికల్ క్యాంపులు.. ఇంటింటికి వైద్య సేవలు..

3.78 కోట్ల మందికి ఆరోగ్య స్క్రీనింగ్ పరీక్షలు..

ఇప్పటివరకూ రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 12000 వైద్య శిబిరాలు నిర్వహించడం జరిగింది. ఈ వైద్య శిబిరాలకు 60.9 లక్షల మంది ప్రజలు హాజరయ్యారు. అందులో 59. 2 లక్షలమందిని వైద్య సిబ్బంది పరీక్షించారు. ఇప్పటివరకూ 1. 44 కోట్ల గృహాలను వైద్య సిబ్బంది సందర్శించి 6.4 కోట్ల పరీక్షలు చేశారు. 3.78 కోట్ల మందికి ఆరోగ్య స్క్రీనింగ్ పరీక్షలు చేపట్టారు. గ్రామ, వార్డు సచివాలయాల స్థాయిలో 13,930 వరకూ శిక్షణ శిబిరాలు నిర్వహించారు. ఇక 1. 38 కోట్ల కుటుంబాలను వార్డు, గ్రామ వాలంటీర్లు సందర్శించి ప్రజల ఆరోగ్య పరిస్థితిని అడిగితెలుసుకున్నారు. ఈ విధంగా ఇంటింటికీ వైద్యం అందిస్తున్న సీఎం వైయస్ జగన్ అందరి ఇళ్లలో ఆరోగ్యం రూపంలో నిలిచారు.

Google News