ఏపీలో కొత్త పార్టీ.. అసెంబ్లీ బరిలో ఉంటుందా?

ఏపీలో కొత్త పార్టీ.. అసెంబ్లీ బరిలో ఉంటుందా?

ఏపీలో ఎన్నికలకు సమయం ఆసన్నమవుతోంది. ఈ క్రమంలోనే కొత్త పార్టీలు సైతం పుట్టుకొస్తున్నాయి. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఆంధ్రప్రదేశ్‌లో కొత్త పార్టీని ప్రకటించారు. జై భారత్ పార్టీ పేరుతో తన పార్టీని రిజిస్ట్రేషన్ చేయించారు. గత ఏడాదే రిజిస్ట్రేషన్ చేయించినప్పటికీ ఎందుకో దీనిని వెలుగులోకి తీసుకురాలేదు. తాజాగా ఆయన తన పార్టీని లాంచ్ చేయడంతో పాటు పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. జై భారత్ పార్టీ ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల పోటీలోకి దిగనుంది.

ఇక జేడీ లక్ష్మీనారాయణ విశాఖ నుంచి పోటీ చేయాలనుకుంటున్నట్టుగా ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు అది కన్ఫర్మ్ అయిపోయింది. ఇక 2019లో లక్ష్మీనారాయణ జనసేన పార్టీ నుంచి వైజాగ్ పార్లమెంటు బరిలో నిలిచారు. కానీ ఓటమి పాలయ్యారు. ఆ తరువాత జనసేన నుంచి బయటకు వచ్చి కొంతకాలం పాటు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అయితే విశాఖ నుంచి పోటీ చేయాలని అనుకుంటున్నట్టు చెప్పినా కూడా ఆయనకు ఏ పార్టీ నుంచి ఆహ్వానం అందలేదు.

Advertisement

ఈ క్రమంలోనే ఇక లక్ష్మీనారాయణే స్వయంగా పార్టీని స్థాపించి తన పార్టీ నుంచే విశాఖ నుంచి లోక్‌సభకు పోటీ చేయనున్నారు. జేడీ లక్ష్మీనారాయణ రాజకీయ భవిష్యత్ గురించి రకరకాలు కథనాలు ప్రచారం జరిగాయి. ఏ నేతను పొగిడితే ఆ పార్టీలో చేరబోతున్నారంటూ ప్రచారం నిర్వహించారు. తాను ఏ పార్టీకీ సపోర్ట్ ఇవ్వడం లేదని లక్ష్మీనారాయణ క్లారిటీ కూడా ఇచ్చుకున్నారు. ఇక ఇప్పుడు ఆయన పార్టీ నుంచి ఎంత మంది అభ్యర్థులను అసెంబ్లీ బరిలో దింపుతారనేది ఆసక్తికరంగా మారింది.