వైసీపీ మేనిఫెస్టోలో కీలక అంశాలివే..!

వైసీపీ మేనిఫెస్టోలో కీలక అంశాలివే..!

ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఈ తరుణంలో పార్టీలన్నీ ఎన్నికల కోసం సన్నద్ధమవుతున్నాయి. ఎన్నికల్లో కీలకమైనది మేనిఫెస్టోనే. విక్టరీ డిసైడింగ్ ఫ్యాక్టర్స్‌లో ఇది కూడా ఒకటి. పార్టీలన్నీ మేనిఫెస్టో రూపకల్పనలో చాలా బిజీగా ఉన్నాయి. ఇక వైసీపీ మేనిఫెస్టో త్వరలోనే విడుదల కానుందని టాక్. ఈ క్రమంలోనే మేనిఫెస్టో రూపకల్పన తుది దశకు చేరుకుందట. అది పూర్తైన వెంటనే విడుదల చేస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభలతో బిజీగా ఉన్నారు.

బాపట్ల జిల్లా మేదరమెట్లలో మార్చి 10న సిద్ధం సభ నిర్వహించాలని భావిస్తున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్, ప్రమోషనల్ సాంగ్ కూడా తాజాగా విడుదలైంది. ఈ సభలోనే మేనిఫెస్టోను విడుదల చేయాలని భావిస్తున్నారు. ఈ సభ ఏర్పాట్ల బాధ్యతను ఎంపీ విజయసాయిరెడ్డి తన భుజస్కందాలపై వేసుకున్నారు. మరి వైసీపీ మేనిఫెస్టోపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈ మేనిఫెస్టోలో మరోసారి నవరత్నాలకు పెద్ద పీట వేశారని టాక్. పథకాలను మరింత మెరుగ్గా అమలు పరిచేలా రూపకల్పన చేశారట.

బీసీ,  ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలపై మేనిఫెస్టోలో వరాల జల్లు కురిపించనున్నారని తెలుస్తోంది. సిద్ధం సభలో కూడా సీఎం జగన్ తను అధికారం చేపట్టిన నాటి నుంచి ఇప్పటి వరకూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు ఏం చేసిందో వివరించనున్నారట. అలాగేఈ నెల 13, 14 తేదీల్లో అసెంబ్లీ ఎన్నికల జాబితాను పూర్తి స్థాయిలో వెలువరించనున్నట్టు విజయసాయిరెడ్డి తెలిపారు. ఇది పూర్తైతే వైసీపీ నేతలంతా ప్రచార బరిలోకి దిగే అవకాశం ఉంది. మరి ఈ జాబితాలో ఏమైనా మార్పులు చేర్పులు ఉంటాయా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది.

Google News