ఏపీలో ఆగిన పెన్షన్లు… చంద్రబాబు మీద ఫైర్ అవుతున్న వృద్ధులు, వికలాంగులు

ఏపీలో ఆగిన పెన్షన్లు… చంద్రబాబు మీద ఫైర్ అవుతున్న వృద్ధులు, వికలాంగులు

ఒకటో తారీఖు కోసం నిరుపేదలు, వృద్ధులు, వికలాంగులు ఎంతగానో ఎదురు చూస్తుంటారు. ఒకటో తారీఖు వస్తే పెన్షన్ వస్తుంది. కాస్త తినడానికి వంట సామాన్లు కొనుక్కోవడానికి వీలవుతుంది. లేదంటే కడుపు మాడ్చుకోవడమే. జగన్ ప్రభుత్వం ఎవరినీ ఇబ్బంది పెట్టలేదు. ఒకటో తారీఖు వస్తే వలంటీర్లతో ఇంటికే పెన్షన్ చేరేలా చేసింది. గుమ్మం వద్దకు వెళ్లి మరీ అర్హులతో వేలి ముద్ర వేయించుకుని పెన్షన్ అందిస్తూ వస్తున్నారు వలంటీర్లు. కానీ ఈ నెల వలంటీర్ లేడు. పెన్షనూ రాలేదు.

ఈ పాపం మాత్రం టీడీపీ అధినేత చంద్రబాబుదే. అవ్వాతాతలు, వికలాంగులకు ఇంటింటికి వెళ్లి సేవలు అందిస్తున్న వలంటీర్ల కాళ్లకు చంద్రబాబు సంకెళ్లు వేశారు. వాళ్ళకు వలంటీర్లు పెన్షన్లు ఇవ్వొద్దని పిటిషన్ వేయడంతో.. వలంటీర్లు పెన్షన్లు పంపిణీ చేయడానికి వీల్లేదంటూ ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. దీంతో పెన్షనర్లకు నిరాశే మిగిలింది.  చంద్రబాబు కుట్రవల్ల వారికి ఫస్ట్ తేదీన రావాల్సిన పెన్షన్ డబ్బులు చేతిలో పడలేదు. ఆయన చేసిన ఒక్క దురాలోచన.. మొత్తం లక్షలాదిమంది అవ్వాతాతల ఆశలు చిదిమేసింది.

ఏపీలో ఆగిన పెన్షన్లు… చంద్రబాబు మీద ఫైర్ అవుతున్న వృద్ధులు, వికలాంగులు

అసలే ఎండలు మండుతున్నాయి. ఈ ఎండలో అవ్వాతాతలు… వికలాంగులు సచివాలయం వద్ద క్యూలో నిలబడాలి. ఆ తరువాత రేషన్ సరుకులు తీసుకుని.. అక్కడి నుంచి ఇళ్లకు వెళ్లాలి. ముఖ్యంగా నెలకు సరిపడా బియ్యం మోసుకుంటూ ఇంటికి వెళ్లడమంటే ఆషామాషీ వ్యవహారం కాదు. నిన్నటి వరకూ గుమ్మం ముందుకు వచ్చి పెన్షన్లు… బియ్యం.. పప్పులు వచ్చేవని,  ఇప్పుడు చంద్రబాబు చేసిన కుట్రలకు తాము  ఇబ్బందులపాలవుతున్నారని లక్షలాదిమంది ప్రజలు చంద్రబాబును తిడుతున్నారు. చంద్రబాబు అధికారంలోకి రాకుండానే ఇన్ని కుట్రలు పన్నుతుంటే.. అధికారంలోకి వస్తే పరిస్థితేంటని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈసారి ఎన్నికల్లో తమ సత్తా చూపుతామని అవ్వాతాతలు చెబుతున్నారు. చంద్రబాబుకు ఇదేం పోయేకాలం అని వారు శాపనార్థాలు పెడుతున్నారు. 

Google News