టీడీపీ అభ్యర్థుల మూడో జాబితా విడుదల..

టీడీపీ అభ్యర్థుల మూడో జాబితా విడుదల..

టీడీపీ అభ్యర్థుల మూడో జాబితా ఇవాళ విడుదలైంది. పొత్తులో భాగంగా టీడీపీ 144  అసెంబ్లీ, 17 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేయనున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా ఇప్పటికే 128 శాసనసభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇవాళ11 శాసనసభ స్థానాలతో పాటు 13 ఎంపీ అభ్యర్థులను ప్రకటించింది. ఇక కేవలం 5 అసెంబ్లీ, 4 ఎంపీ స్థానాలను మాత్రమే పెండింగ్‌లో ఉంచింది.

మైలవరం స్థానాన్ని మాజీ మంత్రి దేవినేని ఉమకు కేటాయిస్తుందనుకుంటే ఇటీవల పార్టీలో చేరిన వసంత కృష్ణప్రసాద్‌కు టీడీపీ కేటాయించి  షాక్ ఇచ్చింది. ఇక సర్వేపల్లి తనకు దక్కుతుందో లేదోనని.. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆందోళనకు గురయ్యారు. కానీ ఆ స్థానాన్ని టీడీపీ సోమిరెడ్డికే కేటాయించింది. ఇక తనకు టికెట్ దక్కదని తీవ్ర ఆందోళన చెందిన బోడె ప్రసాద్‌కు టీడీపీ అధిష్టానం పెనుమలూరు టికెట్ కేటాయించి ఖుషీ చేసింది.

అసెంబ్లీ స్థానాల అభ్యర్థులు..

పలాస-గౌతు శిరీష
పాతపట్నం- మామిడి గోవిందరావు
శ్రీకాకుళం-గొండు శంకర్‌
శృంగవరపుకోట- కోళ్ల లలితకుమారి
కాకినాడ సిటీ- వనమాడి వెంకటేశ్వరరావు (కొండబాబు)
అమలాపురం (ఎస్సీ)- అయితాబత్తుల ఆనందరావు
పెనమలూరు-బోడె ప్రసాద్‌
మైలవరం- వసంత వెంకట కృష్ణప్రసాద్‌
నరసరావుపేట- చదలవాడ అరవిందబాబు
చీరాల- మద్దులూరి మాలకొండయ్య యాదవ్‌
సర్వేపల్లి- సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి
లోక్‌సభ స్థానాల అభ్యర్థులు..
శ్రీకాకుళం- కింజరాపు రామ్మోహన్‌నాయుడు
విశాఖపట్నం- మతుకుమిల్లి భరత్
అమలాపురం-  గంటి హరీష్
ఏలూరు- పుట్టా మహేశ్‌ యాదవ్
విజయవాడ- కేశినేని శివనాథ్‌ (చిన్ని)
గుంటూరు- పెమ్మసాని చంద్రశేఖర్
నరసరావుపేట- లావు శ్రీకృష్ణ దేవరాయలు
బాపట్ల- టి.కృష్ణ ప్రసాద్
నెల్లూరు- వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి
చిత్తూరు- దగ్గుమళ్ల ప్రసాదరావు
కర్నూలు- బస్తిపాటి నాగరాజు (పంచలింగాల నాగరాజు)
నంద్యాల- బైరెడ్డి శబరి
హిందూపురం- బీకే పార్థసారథి