కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల జాబితాలో ఆసక్తికర విషయాలివే..

తెలంగాణలో కాంగ్రెస్‌కు పట్టం కట్టిన సర్వేలు

తెలంగాణ విషయానికి వస్తే ప్రస్తుతం అందరి చూపూ కాంగ్రెస్ పార్టీపైనే ఉంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితా విషయంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈసారి కూడా అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే గెలుపు గుర్రాలకే అధిష్టానం టికెట్ కేటాయిస్తుందా? లేదంటే ఒత్తిడులకు తలొగ్గుతుందా? అనే విషయాలపై తీవ్ర స్థాయిలో చర్చ జరిగింది. మొత్తానికి అభ్యర్థుల జాబితాపై క్లారిటీ రానే వచ్చింది. గత రాత్రి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది.

దేశవ్యాప్తంగా మొత్తం 57 మందితో కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థుల మూడో జాబితాను విడుదల చేసింది. దీనిలో భాగంగా తెలంగాణలోని మరో 5 స్థానాలకు అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. దీనిలో పలు ఆసక్తికర విషయాలున్నాయి. ప్రకటించిన ఐదుగురు అభ్యర్థుల్లో ముగ్గురు బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారే కావడం గమనార్హం. దానం నాగేందర్, రంజిత్ రెడ్డి, సునీత మహేందర్ రెడ్డిలు ముగ్గురూ బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారే. అసలు కీలక స్థానాలను మాత్రం కాంగ్రెస్ పార్టీ పెండింగ్‌లో పెట్టింది.

Advertisement

కొద్ది రోజుల క్రితమే తెలంగాణలోని నాలుగు స్థానాలకు అభ్యర్థులను ఏఐసీసీ ప్రకటించింది. పెండింగ్‌లో మాత్రం కీలక స్థానాలున్నాయి. ఖమ్మం, హైదరాబాద్, ఆదిలాబాద్, వరంగల్, భువనగిరి, కరీంనగర్, మెదక్, నిజామాబాద్ ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ముఖ్యంగా ఖమ్మంలో ముగ్గురు మంత్రులూ తమ కుటుంబీలకు ఎంపీ టికెట్ ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు.

అభ్యర్థుల జాబితా ఇదే..

1. చేవెళ్ల – రంజిత్ రెడ్డి

2. నాగర్ కర్నూల్ – మల్లు రవి

3. మల్కాజ్ గిరి- సునీత మహేందర్ రెడ్డి

4. పెద్దపెల్లి – గడ్డం వంశీ

5. సికింద్రాబాద్ – దానం నాగేందర్